Begin typing your search above and press return to search.

కల్కి.. ఈవెంట్స్ విషయంలో కూడా తగ్గేదేలే!

అభిమానుల హోప్స్ కు తగ్గట్టు మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. మూవీపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 9:21 AM GMT
కల్కి.. ఈవెంట్స్ విషయంలో కూడా తగ్గేదేలే!
X

సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్కి 2898 ఏడీ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్ పై నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కల్కి ప్రపంచాన్ని చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అభిమానుల హోప్స్ కు తగ్గట్టు మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తో సందడి చేస్తున్నారు. మూవీపై మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.

రీసెంట్ గా ఫేమస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీల్యూడ్ వీడియాస్ ను రిలీజ్ చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మూవీ రిలీజ్ కు ముందు నాగ్ అశ్విన్ బుజ్జి, భైరవను పరిచయం చేసిన విధానానికి అంతా ఫిదా అయిపోయారు. అంతకుముందు వెహికల్ బుజ్జిని మేకర్స్ రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ బుజ్జి.. దేశంలోని పలు నగరాల్లో తిరుగుతోంది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు కూడా రానున్నట్లు టాక్ నడుస్తోంది.

అయితే ఇప్పుడు ప్రమోషన్స్ స్పీడ్ ను మరింత పెంచనున్నారు మేకర్స్. ఢిల్లీ, ముంబైలో భారీ స్థాయిలో రెండు ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత హైదరాబాద్ లేదా ఆంధ్రప్రదేశ్ లో మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు, జూన్ 7వ తేదీన జరగనున్నట్లు వినికిడి.

ఇక సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విలక్షణ నటుడు కమల్ హాసన్, బ్రహ్మానందం, పశుపతి, స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి పలువురు నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. హీరోయిన్ కీర్తి సురేష్.. బుజ్జి వెహికల్ కు వాయిస్ ఓవర్ చెప్పి సినిమాలో భాగమైంది. భైరవగా ప్రభాస్.. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు.

అయితే కల్కి సినిమా రన్ టైమ్ కూడా రీసెంట్ గా లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 2 గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించనునట్లు టాక్ వినిపిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి జూన్ 27వ తేదీన కల్కి మూవీ ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.