Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ… ఈ పొరపాటు ప్రభావం చూపదు కదా?

వీటిని సీజీలో ఓ కొత్త ప్రపంచంగా చూపిస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై అలాంటి విజువల్స్, న్యూ వరల్డ్ ను చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 4:56 AM GMT
కల్కి 2898ఏడీ… ఈ పొరపాటు ప్రభావం చూపదు కదా?
X

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్ లతో మూవీస్ చేయడంతో మేకర్స్ కూడా విజువల్ స్పెక్టక్యులర్ అనిపించుకునే కథలని తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. విఎఫ్ఎక్స్ కిప్రాధాన్యత ఇస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు మిగిలిన కథని కూడా ఒక ఫిక్షనల్ ప్రపంచంలో రీక్రియేట్ చేస్తున్నారు. దానికోసం అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్లకుండా ఇన్ డోర్ లోనే సెట్స్ వేసి వారికి కావాల్సిన లొకేషన్స్ కి క్రియేట్ చేసుకుంటున్నారు.

వీటిని సీజీలో ఓ కొత్త ప్రపంచంగా చూపిస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై అలాంటి విజువల్స్, న్యూ వరల్డ్ ను చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఆడియన్స్ ని మరింత థ్రిల్ చేయాలని సినిమాకి 3డీ టచ్ ఇస్తున్నారు. 3డీలో మూవీని తెరపై చూపిస్తే ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. అయితే మన దేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఎక్కువగా ఉన్నాయి.

ఇలాంటి చోట్ల 3డీ వెర్షన్ లో మూవీని ప్రదర్శించలేరు. కేవలం 2డీలోనే చూడాలి. మల్టీప్లెక్స్ లలో మాత్రమే 3డీ సాధ్యం అవుతుంది. అయితే మేకర్స్ 3డీ వెర్షన్స్ ని ఎక్కువగా ప్రమోట్ చేయడం వలన ఆ ఇంపాక్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పై పడుతుంది. గతంలో శంకర్ 2.ఓ మూవీని 3డీలో రిలీజ్ చేసి దానిని ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ మీద కనిపించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ హౌస్ ఫుల్ కాలేదు.

ఇప్పుడు కల్కి 2898ఏడీ చిత్రాన్ని కూడా 2డీతో పాటు 3డీ వెర్షన్ లో రిలీజ్ చేయబోతున్నారు. మేకర్స్ 3డీ వెర్షన్ లో కల్కి యూనివర్స్ ని చూడమని మరీ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. అయితే 3డీలో చూడాలని ఆడియన్స్ కోరుకుంటే కచ్చితంగా ఆ ఇంపాక్ట్ కల్కి 2డీ వెర్షన్ రిలీజ్ అయ్యే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పై ఎంతో కొంత పడుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రచారంపై మేకర్స్ పునరాలోచన చేసి 3డీతో పాటు 2డీని కూడా ప్రమోట్ చేయాలని చెబుతున్నారు.

జూన్ 27న కల్కి 2898ఏడీ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. మూవీలో బలమైన కథ, కథనం కూడా ఉండబోతోందని ఈ ట్రైలర్స్ తో స్పష్టమైంది. మరి ఈ కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులు ఏ విధంగా ఆధరిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.