Begin typing your search above and press return to search.

సైలెంట్‌గా 'కల్కి 2898 AD' గ్లింప్స్ వ‌దిలాడు

కల్కి 2898 AD కోసం పాటలు, ఒరిజినల్ స్కోర్‌ను కంపోజ్ చేసిన ప్రఖ్యాత సంగీతకారుడు సంతోష్ నారాయణన్ చెన్నైలో జరిగిన 'నీయే ఓలి' కచేరీలో పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   12 Feb 2024 4:18 AM GMT
సైలెంట్‌గా కల్కి 2898 AD గ్లింప్స్ వ‌దిలాడు
X

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా 'కల్కి 2898 AD'. దీపిక ప‌దుకొనే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కుడు. వైజ‌యంతి మూవీస్ ప‌తాకంపై అశ్వ‌నిద‌త్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మిద‌ని ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు క్లూ ఇచ్చారు.

ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ స‌హా లీక్డ్ పోస్ట‌ర్లు ఆస‌క్తిని క‌లిగించాయి. భవిష్యత్ వైజ్ఞానిక కల్పనా చిత్రంగా చెబుతున్న ఈ సినిమా 2024 మే9న విడుద‌ల‌వుతుంద‌ని తెలిపారు. అయినా ఇంకా విడుదల తేదీపై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్నారు. కల్కి 2898 AD కోసం పాటలు, ఒరిజినల్ స్కోర్‌ను కంపోజ్ చేసిన ప్రఖ్యాత సంగీతకారుడు సంతోష్ నారాయణన్ చెన్నైలో జరిగిన 'నీయే ఓలి' కచేరీలో పాల్గొన్నారు. ఆసక్తికరంగా కచేరీలో ప్రత్యేకంగా 'క‌ల్కి' థీమ్ మ్యూజిక్ గ్లింప్స్ ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచాడు.

శుక్రవారం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన 'నీయే ఓలి' కచేరీలో ఈ ఘ‌ట‌న ప్ర‌భాస్ అభిమానుల‌కు నిజంగానే బిగ్ స‌ర్ ప్రైజ్ నిచ్చింది. ఈ థీమ్ మ్యూజిక్ గ్లింప్స్ ప్రభాస్ అభిమానులను సినీ ప్రేక్షకులను బాగా ఉత్సాహపరిచింది. సైన్స్ ఫిక్ష‌న్ సినిమాల‌కు రీరికార్డింగ్, బీజీఎం చాలా కీల‌క‌మైన‌వి. ఈ ప్రాజెక్ట్ కోసం సంతోష్ నారాయణన్ విదేశీ స్టూడియోలో నేపథ్య సంగీతాన్ని కంపోజ్ చేసినట్లు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇది భవిష్యత్ డిస్టోపియన్ నేప‌థ్యంలో క‌థాంశం. భారీ ప్ర‌యోగానికి త‌గ్గ‌ట్టుగా నేప‌థ్య సంగీతం సూట్ అవ్వాల్సి ఉంటుంది. తాజా మ్యూజిక్ గ్లింప్స్ వీడియోపై నెటిజ‌నుల్లో డిబేట్ కొన‌సాగుతోంది. సాంకేతిక అంశాల విషయానికి వస్తే... కల్కి 2898 AD సంచ‌ల‌నాల ఫ్రాంఛైజీ 'బాహుబలి'ని బీట్ చేస్తుందని నమ్మకంగా ఉన్నారు.