కల్కి.. అవన్నీ థియేటర్ లోనే..
మొన్నటివరకు మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారనే కామెంట్స్ వచ్చాయి.
By: Tupaki Desk | 19 Jun 2024 9:30 AM GMTరెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898 AD" సినిమా రిలీజ్ కు ఇంకా వారం రోజుల టైమ్ మాత్రమే ఉంది. ఇక సినిమా గురించి రోజుకో సరికొత్త వివరాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నటివరకు మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారనే కామెంట్స్ వచ్చాయి. ఇక రీసెంట్ గా దర్శకుడు అతని టీమ్ వేగాన్ని పెంచారు. సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యేలా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ఎలా ఉంటుందో అనే అంశం కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ సినిమాలో కేవలం రెండు పాటలే ఉన్నాయనే అపోహ ఉంది. కానీ, తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఆరు నుంచి ఏడు పాటలు ఉండనున్నాయి. ఇప్పటివరకు ఈ చిత్రంలో భైరవా యాంతమ్ పాట విడుదలైందీ, అలాగే దిల్‌జిత్ దోసాంజ్ ఈ పాటను పాడారు. ప్రభాస్, దిశా పటానీ కలిసి చేసిన మరో డ్యూయెట్ పాట కూడా త్వరలో విడుదలకానుంది.
ఈ రెండు పాటలే కాకుండా, సంతోష్ నారాయణ్ స్వరపరిచిన మరెన్నో పాటలు ఈ సినిమాలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపికా పడుకోన్ పై చిత్రీకరించిన ఓ ఏమోషనల్ సాంగ్ కూడా ఉందట. అలాగే, అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న అశ్వత్థామ పాత్రకు సంబంధించిన ప్రత్యేక పాట కూడా ఉండనుంది. ఇలా మొత్తం ఆరు నుంచి ఏడు పాటలు కల్కి 2898 AD లో ఉంటాయని తెలుస్తోంది.
నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అనేక సాంవ్స్ ను రహస్యంగా ఉంచి, ప్రేక్షకులకు థియేటర్లో ఆశ్చర్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అందుకే సాంగ్స్ అప్డేట్స్ విషయంలో కాస్త ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రభాస్ అభిమానులను భిన్న ప్రపంచంలోకి తీసుకెళ్లాలని, వారి కోసం ప్రత్యేక అనుభూతిని కలిగించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రబాస్ భైరవ పాత్రలో కనిపించనుండగా, దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు, కమల్ హాసన్, శశ్వత ఛటర్జీ, దిశా పటానీ, మృణాల్ ఠాకూర్, శోభన, రాజేంద్ర ప్రసాద్, పసుపతి మరియు ఇతరులు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతి మూవీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. ఈ సినిమా 3D, 4DX మరియు IMAX ఫార్మాట్లలో విడుదలకానుంది.