కల్కి2898 AD: ఇది నెవ్వర్ బిఫోర్ రికార్డ్
రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కిగా కనిపించబోతున్నాడు.
By: Tupaki Desk | 26 Feb 2024 3:42 AM GMTడార్లింగ్ ప్రభాస్ హీరోగా ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కరిస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కిగా కనిపించబోతున్నాడు.
కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తు భూ ప్రపంచాన్ని మూవీలో చూపించబోతున్నారు. అందుకే సినిమా మొత్తం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో విజువల్ ఎఫెక్ట్స్ బేస్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఈ మూవీ కచ్చితంగా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
మార్చి మూడో వారంలో ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. మేలో మూవీని వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. అయితే ఈ సినిమాని ఏకంగా 22 భాషలలో ఏక కాలంలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుందని తెలుస్తోంది. 22 భాషలలో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా కల్కి ఉండబోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇంగ్లీష్ వెర్షన్ కూడా ఇప్పటికే సిద్ధం అవుతోందని టాక్. హాలీవుడ్ లెవల్ లో కల్కి సౌండ్ వినిపించేలా, అలాగే మన టాలెంట్ అంతర్జాతీయ స్థాయిలో అందరికి తెలిసేలా కల్కి చేయబోతోందని డార్లింగ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. హై ఎక్స్ పెక్టేషన్స్ మధ్యలో ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా షురూ చేశారు.
ఈ మూవీలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అమితాబచ్చన్ లార్డ్ పరశురామ్ పాత్రలో కనిపించనున్నారంట. దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ అశ్వినీదత్ నిర్మిస్తోన్న ఈ మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో అనేది చూడాలి.