'కల్కి' ఓటీటీ వర్షన్ తప్పక చూడాల్సిందే..!
ఈ రెండు ఓటీటీ ల్లో కూడా కల్కి కి భారీ ఎత్తున వ్యూస్ లభిస్తున్నాయి.
By: Tupaki Desk | 23 Aug 2024 1:41 PM GMTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొంది రెండు నెలల క్రితం వచ్చిన కల్కి 2898 AD చిత్రం నేటి నుంచి ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా ఎక్కువ శాతం సినిమాలు ఒకే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతాయి. అందులోనే అన్ని భాషల డబ్బింగ్ వర్షన్ లు కూడా అందుబాటులో ఉంటాయి. కానీ కల్కి సినిమా మాత్రం రెండు ఓటీటీ ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ కల్కి ని నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సి ఉండగా, సౌత్ భాషల్లో మాత్రం అమెజాన్ ప్రైమ్ లో చూడాల్సి ఉంది. ఈ రెండు ఓటీటీ ల్లో కూడా కల్కి కి భారీ ఎత్తున వ్యూస్ లభిస్తున్నాయి.
థియేటర్ లో చూసిన వారు కూడా ఓటీటీ లో కల్కి సినిమాను చూడాల్సిందే అనే టాక్ నడుస్తోంది. ఎందుకంటే కల్కి ని థియేటర్ లో చూసిన వారు కొన్ని సన్నివేశాలను సాగతీసినట్లుగా ఫీల్ అయ్యారు. కొన్ని సన్నివేశాలు అనవసరం అనుకున్నారు. సినిమా నిడివి ఎక్కువ ఉన్న కారణంగా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ కోసం మేకర్స్ కొత్త వర్షన్ ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయడంతో పాటు, కొన్ని సన్నివేశాలను తొలగించారట. మొత్తంగా కల్కి ని కొత్తగా క్రిస్పీ గా చేశారట.
ప్రభాస్ సన్నివేశాలతో పాటు, ఇతర నటీనటుల సన్నివేశాలు కాస్త స్పీడ్ గా ఉండే విధంగా, కొన్ని బోరింగ్ సన్నివేశాలను ట్రిమ్ చేయడం జరిగిందని ఓటీటీ వర్షన్ చూసిన వారు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కల్కి సినిమా థియేట్రికల్ రిలీజ్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపుగా రూ. వెయ్యి కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అంచనా వేస్తున్నారు.
కల్కి సినిమా కి రెండో పార్ట్ ను రూపొందించే పనిలో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు స్టోరీ విషయంలో నాగ్ అశ్విన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు కథ విషయంలో ఎలాంటి నిర్ణయానికి రాలేదు అన్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ను కల్కి 2 లో ఆసక్తికర పాత్ర లో చూపించే అవకాశాలు ఉన్నాయి. కమల్ పాత్ర ను కూడా కాస్త ఎక్కువ నిడివితో చూపించే అవకాశాలు ఉన్నాయట. మొత్తానికి కల్కి 2 కోసం ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఎదురు చూపులు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.