Begin typing your search above and press return to search.

కల్కి పార్ట్ 2… మరో న్యూ వరల్డ్

కల్కి 2898ఏడీ మూవీ కమర్షియల్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది.

By:  Tupaki Desk   |   6 July 2024 3:30 PM GMT
కల్కి పార్ట్ 2… మరో న్యూ వరల్డ్
X

కల్కి 2898ఏడీ మూవీ కమర్షియల్ సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ నిలకడగా రావడంతో ఈ మూవీ ఓవరాల్ వసూళ్లు 800 కోట్లకి చేరినట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ లాంగ్ రన్ లో కల్కి మూవీ అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ కలెక్షన్స్ ఎప్పటికి వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కల్కి పార్ట్ 1లో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ కంటే అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వద్ధామ పాత్రని ఎక్కువగా చూపించారు.

కథని నడిపించేది కూడా ఆ పాత్రనే. భైరవ అక్కడక్కడా తళుక్కున మెరుస్తూ ఉంటాడు. అయితే కల్కి 2898ఏడీ పార్ట్ 1లో భైరవ పాత్ర కావాలనే పూర్తి రివీల్ చేయకుండా హోల్డ్ చేసినట్లు నాగ్ అశ్విన్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఓ ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూలో కల్కి విశేషాలని నాగ్ అశ్విన్ పంచుకున్నారు. ఈ మూవీలో ప్రతి పాత్ర ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యిందని నాగ్ అశ్విన్ చెప్పారు. కల్కి పార్ట్ 2 విషయంలో ప్రేక్షకులు ఇంతకు మించి ఎక్స్ పెక్ట్ చేస్తారని అన్నారు.

ప్రేక్షకుల ఇమాజినేషన్ ని దృష్టిలో ఉంచుకొని కథ చెప్పే విషయంలో మరింత ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కల్కి పార్ట్ 1లో కాశి, శంబాలా, కంప్లెక్స్ అనే మూడు ప్రాంతాలని చూపించడం జరిగిందని అన్నారు. పార్ట్ 2 లో మరో కొత్త వరల్డ్ ని కూడా పరిచయం చేయబోతున్నట్లు చెప్పారు. కథలో మరింత సస్పెన్స్, థ్రిల్లింగ్ అందించే ఉద్దేశ్యంతో నాలుగో ప్లేస్ ని పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు.

అయితే అలాగే పార్ట్ 2 కథపైన మరింత రీసెర్చ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చాడు. కొత్త పాయింట్స్ ని టచ్ చేయడంతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ని ఆడియన్స్ కి మరింత కొత్తగా రిప్రజెంట్ చేయాలంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉందని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై నాగ్ అశ్విన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అశ్వినీదత్ అయితే కల్కి పార్ట్ 2ని వచ్చే ఏడాది జూన్ నాటికి తీసుకొని వస్తామని తెలిపారు.

అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఈ సీక్వెల్ విషయంలో ఎలాంటి టైమ్ లైన్ పెట్టుకోలేదని తెలుస్తోంది. కచ్చితంగా ప్రతి ఎలిమెంట్ కి పెర్ఫెక్ట్ గా ఆవిష్కరించడంపైనే ఇప్పుడు అతని ఫోకస్ ఉందంట. కాంట్రవర్సీలకి తావివ్వకుండా కల్కి పార్ట్ 2 చేయాలని నాగ్ అశ్విన్ అనుకుంటున్నారు. త్వరలో ఈ మూవీ స్క్రిప్ట్ పై నాగ్ అశ్విన్ మరింత వర్క్ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హిందుత్వ సంఘాల నుంచి కల్కి మూవీలో క్యారెక్టరైజేషన్స్ పై వచ్చిన అభ్యంతరాలని నాగ్ అశ్విన్ పార్ట్ 2లో ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది.