Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ.. పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే?

కల్కి 2898 ఏడీ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో నడుస్తోంది. కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   4 July 2024 5:31 AM GMT
కల్కి 2898ఏడీ.. పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే?
X

కల్కి 2898 ఏడీ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో నడుస్తోంది. కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వస్తున్నాయి. ఏడురోజుల్లో 700+ కోట్లు దాటినట్లు తాజా లెక్కల బట్టి తెలుస్తోంది. ఆరు రోజుల్లోనే 680+ కోట్లు కలెక్షన్స్ ని అందుకుంది. ఏడో రోజు ఎంత వసూళ్లు సాధించింది అనేది తెలియాల్సి ఉంది. నార్త్ ఇండియా, నార్త్ అమెరికాలో సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయంట. అలాగే తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి వసూళ్లనే సాధిస్తోంది.

ఇప్పటికే నార్త్ ఇండియాలో 150+ కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఓవర్సీస్ లో 100 కోట్లు దాటిపోయింది. లాంగ్ రన్ లో 1000-1200 కోట్ల మధ్యలో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు తగ్గిస్తే మళ్ళీ ప్రేక్షకులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే కల్కి మూవీకి హిట్ టాక్ రావడంతో దీనికి సీక్వెల్ గా రాబోయే మూవీపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

కల్కి పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పబ్లిక్ లో ఉంది. డార్లింగ్ ప్రభాస్ గత ఏడాది ఆఖరులో సలార్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా కల్కి 2898ఏడీతో మరో హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. కల్కి పార్ట్ 2 కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో డార్లింగ్ అభిమానులు ఉన్నారు. ఇదిలా తాజాగా అశ్వినీ దత్ కల్కి పార్ట్ 2 మూవీపై క్లారిటీ ఇచ్చారు.

కల్కి 2898ఏడీ పార్ట్ 2 షూటింగ్ 60 శాతం కంప్లీట్ అయ్యిందని అశ్వినీదత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఈ మూవీ షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని తాజాగా చెప్పుకొచ్చారు. అలాగే కల్కి పార్ట్ 2 మూవీని 2025 జూన్ లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. వీలైనంత వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి మూవీకి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని అన్నారు. ప్రభాస్ కూడా 10 రోజుల గ్యాప్ తీసుకొని మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి ఒకే చెప్పాడంట.

కల్కి 2898ఏడీలో నాగ్ అశ్విన్ చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా వదిలేశారు. వాటిపై ఎలాంటి క్లారిటీ ఇస్తాడనేది తెలుసుకోవాలంటే క్యూరియాసిటీ ఆడియన్స్ లో ఉంది. పార్ట్ 2లో మొత్తం స్టోరీలో ఉన్న ప్రశ్నలకి నాగ్ సమాధానాలు ఇవ్వబోతున్నాడంట. అలాగే ఎలివేషన్ లేకుండా ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ని పార్ట్ 2లో పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడని తెలుస్తోంది.