Begin typing your search above and press return to search.

నాగ్ అశ్విన్ కల్కి టెన్షన్ ఏ రేంజ్ లో ఉందంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో రెండు క్యారెక్టర్స్ లలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   16 May 2024 3:53 AM GMT
నాగ్ అశ్విన్ కల్కి టెన్షన్ ఏ రేంజ్ లో ఉందంటే..
X

మహానటి బయోపిక్ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకొని నాగ్ అశ్విన్ చేస్తోన్న మూవీ కల్కి 2898ఏడీ. 600 కోట్లకి పైగా బడ్జెట్ తో ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రం రెడీ అవుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ చిత్రంలో రెండు క్యారెక్టర్స్ లలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అందులో శ్రీ మహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కి పాత్ర ఒకటి.

అలాగే భైరవ అనే క్యారెక్టర్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ మూవీ కథాంశంపై ఇప్పటి వరకు ఎవరికి పూర్తి క్లారిటీ లేదు. కంప్లీట్ నాగ్ అశ్విన్ ఐడియాలజీ నుంచి పుట్టిన కథ కావడంతో ఎవరి ఇమాజినేషన్ కి అందడం లేదు. ఫ్యూచర్ కాన్సెప్ట్ లో ఈ మూవీ కథ మొత్తం నడుస్తుందని టైటిల్ బట్టి తెలుస్తోంది. కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్స్ బేస్డ్ గానే కథాంశం మొత్తం ఉంటుంది.

సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఈ మూవీని నాగ్ అశ్విన్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. అవుట్ ఫుట్ తాను అనుకున్న విధంగానే ఉండాలని చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయిన ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది.

జూన్ 27న ఈ మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. కల్కి విఎఫ్ఎక్స్ పై చాలా కంపెనీలు వర్క్ చేస్తున్నాయంట. అయితే తాజాగా నాగ్ అశ్విన్ విఎఫ్ఎక్స్ వర్క్స్ చూశాడంట. క్వాలిటీ విషయంలో అతను అంత సంతృప్తికరంగా లేడని తెలుస్తోంది. దీంతో మళ్ళీ రీవర్క్ చేయిస్తున్నాడంట. నాగ్ అశ్విన్ అవుట్ ఫుట్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గడు.

తాను ఎక్స్ పెక్ట్ చేసిన విధంగానే రావాలని కోరుకుంటాడు. ఈ నేపథ్యంలో కల్కి2898ఏడీ మూవీ విఎఫ్ఎక్స్ కి చాలా టైం తీసుకుంటుందంట. అలాగే చిత్ర యూనిట్ ని కూడా విజువల్ ఎఫెక్ట్స్ టెన్షన్ పెట్టిస్తున్నాయని టాక్. రిలీజ్ డేట్ ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది.

జూన్ మొదటి వారం నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి అనుకున్న టైంకి అవుట్ ఫుట్ వస్తుందా అనేది డౌట్ గానే ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. అయితే నాగ్ అశ్విన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో రిలీజ్ కి వారం రోజులు ముందుగానే కల్కి2898ఏడీ ప్రాజెక్టుని రెడీ చేసుకోవాలని అనుకుంటున్నాడు.