Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ.. అక్కడ మరో రికార్డ్ బ్లాస్ట్

2024లో ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా కల్కి 2898ఏడీ నిలిచింది.

By:  Tupaki Desk   |   19 July 2024 8:05 AM GMT
కల్కి 2898ఏడీ.. అక్కడ మరో రికార్డ్ బ్లాస్ట్
X

2024లో ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా కల్కి 2898ఏడీ నిలిచింది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 1000+ కోట్ల కలెక్షన్స్ ఇప్పటికే కల్కి క్రాస్ చేసింది. బాహుబలి 2 తర్వాత సౌత్ నుంచి వచ్చి అత్యధిక కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా కల్కి 2898ఏడీ నిలిచింది. డార్లింగ్ ప్రభాస్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే లాంటి స్టార్ యాక్టర్స్ కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ లో భాగం అయ్యారు.

ప్రతి ఒక్కరు వారి పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేసి నాగ్ అశ్విన్ చెప్పాలనుకున్న కథని బలంగా జనాల్లోకి వెళ్ళడానికి ఉపయోగపడ్డారు. విజువల్ స్పెక్టక్యులస్ గా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ప్రేక్షకులకి అందించారు. అలాగే సరికొత్త ప్రపంచాన్ని కల్కి మూవీలో ఆవిష్కరించి అందరిని మెస్మరైజ్ చేశారు. ఈ కారణంగానే కల్కి సినిమాకి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే డీసెంట్ కలెక్షన్స్ తో కల్కి మూవీ థియేటర్స్ లో కొనసాగుతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా నార్త్ అమెరికాలో నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. బాహుబలి 2 నార్త్ లో 20+ మిలియన్ డాలర్స్ ని కలెక్ట్ చేసింది. కల్కి 2898ఏడీ మూవీ నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 18+ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని అందుకుందంట. పఠాన్, జవాన్ మూవీ రికార్డులని కూడా కల్కి చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో బ్రేక్ చేసిందని అర్ధమవుతోంది. నార్త్ అమెరికాలో కలెక్షన్స్ వైడ్ గా టాప్ 1, 2 చిత్రాలు రెండు కూడా డార్లింగ్ ప్రభాస్ వే కావడం విశేషం.

ఇదే జోరు కొనసాగితే వరల్డ్ వైడ్ గా జవాన్ మూవీ కలెక్షన్స్ ని కల్కి 2898ఏడీ బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఏ భాషలలో ఇప్పుడు ఈ కల్కి తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ సొంతం చేసుకోలేదు. దీంతో మూడు వారాలు అద్భుతమైన రన్ తో భారీ వసూళ్లని కల్కి చిత్రం సొంతం చేసుకుంది. అయితే జులై 19న తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఇంటరెస్టింగ్ మూవీస్ రిలీజ్ అయ్యాయి.

ఇవి కల్కి సినిమా కలెక్షన్స్ ని ఎంత వరకు హోల్డ్ చేయగలవు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కల్కి 1 సూపర్ సక్సెస్ కావడంతో ప్రేక్షకులు కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ కల్కి 2 స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారంట. అలాగే యాక్టర్స్ కాల్స్ షీట్స్ అన్ని సెట్ అయ్యాక షూటింగ్ కి వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ కారణంగా 2026లో సంక్రాంతికి రిలీజ్ అవ్వొచ్చనే టాక్ నడుస్తోంది.