Begin typing your search above and press return to search.

యూఎస్ లో కల్కి బజ్.. మరో రికార్డ్ బ్రేక్ అయ్యేనా..

అయితే వ్యక్తిగతంగా చూసుకుంటే రాజమౌళి సినిమాలకి మాత్రమే ఓవర్సీస్ లో 3 మిలియన్స్ డాలర్స్ కి పైగా ప్రీమియర్ షోల మార్కెట్ ఉంది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 11:54 AM GMT
యూఎస్ లో కల్కి బజ్.. మరో రికార్డ్ బ్రేక్ అయ్యేనా..
X

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి మరీ ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే చిత్రాలకి ఓవర్సీస్ మార్కెట్ లో సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. సినిమాకి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది హనుమాన్ ఓవర్సీస్ లో మంచి వసూళ్లు సాధించింది. అయితే వ్యక్తిగతంగా చూసుకుంటే రాజమౌళి సినిమాలకి మాత్రమే ఓవర్సీస్ లో 3 మిలియన్స్ డాలర్స్ కి పైగా ప్రీమియర్ షోల మార్కెట్ ఉంది.

హీరోల పరంగా చూసుకుంటే ఆ స్థాయిలో మార్కెట్ ఉన్న ఒకే ఒక్క నటుడు డార్లింగ్ ప్రభాస్. ఇతర హీరోలకు 1.5 మిలియన్ డాలర్స్ వరకే ప్రీమియర్ షోల మార్కెట్ ఉంటే ప్రభాస్ కి మాత్రమే 2.5 నుంచి 3 మిలియన్ డాలర్స్ ప్రీమియర్ షోల మార్కెట్ ఉంది. ఉత్తర అమెరికాలో ఇండియన్ సినిమాలకి ఎక్కువ ఆదరణ లభిస్తూ ఉంటుంది. సలార్ మూవీ ప్రీమియర్ షోలతో ఏకంగా 2.5 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీమియర్ షోల ద్వారా 3.5 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసింది. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఓవర్సీస్ మార్కెట్ ఈ సినిమాకి సంబందించిన ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ప్రాంతాలలో స్టార్ట్ అయిపోయాయి. ఇప్పటికే డీసెంట్ బుకింగ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక కల్కి ట్రైలర్ కి ఆడియన్స్ కి కనెక్ట్ అయితే నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల బుకింగ్స్ ద్వారా 3 మిలియన్ డాలర్స్ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఓవర్సీస్ లో సాలిడ్ కలెక్షన్స్ ని మొదటి రోజు కల్కి 2898ఏడీ అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. టికెట్ ధరలు కూడా భారీగానే ఉన్నాయి. పబ్లిక్ కూడా ఇప్పటి నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

ఉత్తర అమెరికా కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు కూడా ఇప్పటికే బయటకొచ్చాయి. యూఎస్ఏ లో ప్రీమియర్లకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $464కె వచ్చాయంటే. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ $42కె వరకు ఉన్నాయి. ఇక కెనడాలో చూసుకుంటే ప్రీమియర్ల అడ్వాన్స్ బుకింగ్స్ $32కె వరకు జరిగాయి. అందులో మొదటి రోజు బుకింగ్స్ తో $6కె వసూళ్లు అయ్యింది. మొత్తం ప్రీమియర్+డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఉత్తర అమెరికాలో ఇప్పటి వరకు ముందస్తు కలెక్షన్స్ $544కె వరకు వచ్చాయని తెలుస్తోంది.