Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?

భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వైజయంతి మూవీస్ ప్రభాస్ తో కల్కి సినిమా 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించారు.

By:  Tupaki Desk   |   29 May 2024 11:30 PM GMT
కల్కి 2898 AD ఫస్ట్ డే టార్గెట్ ఎంత..?
X

భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వైజయంతి మూవీస్ ప్రభాస్ తో కల్కి సినిమా 500 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కించారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. కల్కి 2898 AD సినిమా ప్రచార చిత్రాలు అదరగొట్టేస్తుండగా సినిమా కచ్చితంగా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందని అంటున్నారు. పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్ స్టామినా చూపించేలా మరోసారి కల్కి వసూళ్లు ఉంటాయని అంటున్నారు.

ముఖ్యంగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ పెద్ద టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రభాస్ కల్కి కోసం సౌత్ ఆడియన్స్ మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జూన్ 27న నేషనల్ లెవెల్ లో బాక్సాఫీస్ కళకళలాడతాయి అంటున్నారు. ఇక పాన్ ఇండియానే కాదు పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న కల్కి ఫస్ట్ డేట్ కలెక్షన్స్ ఎంత రావొచ్చు అనే డిస్కషన్స్ మొదలయ్యాయి.

స్టార్ సినిమాలు ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ లోనే మాక్సిమం వసూళ్లు రాబడతారు. అయితే కల్కి సినిమాకు ఇప్పటివరకు ఫస్ట్ డే వచ్చిన హయ్యెస్ట్ కలెక్షన్స్ ని దాటేస్తుందని చెబుతున్నారు. ప్రభాస్ రేంజ్ ఏంటన్నది కల్కి ఫస్ట్ డే వసూళ్లు చెబుతాయని.. సినిమా ఆశించిన స్థాయిలో ఉంటే ఫస్ట్ డేతో మొదలైన రికార్డులు సినిమా ఫుల్ రన్ వరకు ఉంటాయని అంటున్నారు.

కల్కి సినిమాను ఓవర్సీస్ లో కూడా ఒక తెలుగు సినిమాగా కాకుండా ఇంటర్నేషనల్ సినిమా రేంజ్ లో భారీ సంఖ్యలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా అన్ని విధాలుగా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని చెబుతుండగా తప్పకుండా రెబల్ స్టార్ ఫ్యాన్స్ తో పాటుగా మూవీ లవర్స్ అంతా కూడా కల్కి తో ఫెస్టివల్ జరుపుకుంటారని అంటున్నారు. ప్రభాస్ కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనె, దిశా పటాని లాంటి స్టార్స్ కూడా భాగం అవుతున్నారని తెలిసిందే.

సినిమా విషయంలో నాగ్ అశ్విన్ పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నాడు. అయితే ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన టీం నేషనల్ లెవెల్ లో కల్కి గురించి అందరు మాట్లాడుకునేలా చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే కల్కి కోసం తయారు చేసిన స్పెషల్ ఎలక్ట్రిక్ వెహికల్ బుజ్జిని ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిప్పుతున్న విషయం తెలిసిందే.