Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్ : 'కల్కి' ప్రతిభావంతుల సమూహం

సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ప్రమోషన్స్ అదే స్థాయిలో చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 11:00 AM GMT
పిక్‌ టాక్ : కల్కి ప్రతిభావంతుల సమూహం
X

తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్‌ ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి. హాలీవుడ్‌ సినిమాల స్థాయిలో కల్కి 2898 ఏడీ సినిమా ఉండబోతుందని మొదటి నుంచి చెబుతున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ట్రైలర్‌ విడుదల తర్వాత అందరితో అదే మాట అనిపిస్తున్నాడు.


సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ప్రమోషన్స్ అదే స్థాయిలో చేస్తున్నారు. తాజాగా ముంబైలో కల్కి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరిగింది.

ఈ వేడుకలో ప్రభాస్‌, దీపికా పదుకునే తో పాటు బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబచ్చన్‌, యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఇంకా ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. రానా హోస్ట్‌ గా వ్యవహరించిన ఈ వేడుక చాలా సరదాగా సాగినట్లు సోషల్‌ మీడియా లో ట్రెండ్‌ అవుతున్న వీడియో బిట్స్ ను చూస్తే అర్థం అవుతుంది.

సోషల్‌ మీడియాలో వీడియోలతో పాటు ఈ ఫోటో కూడా తెగ ట్రెండ్‌ అవుతుంది. అశ్వినీదత్‌ ఇద్దరు కుమార్తెలు ప్రియాంక దత్‌, స్వప్న దత్‌ లు కల్కి సినిమాకు అన్ని తామై చూసుకున్నారు. అందుకే ఈ సినిమా ఈ స్థాయిలో రావడానికి వారి ప్రమేయం చాలా ఎక్కువ ఉందని యూనిట్‌ సభ్యులు అంటూ ఉంటారు.

అలాంటి దత్ గారి అమ్మాయిలతో హీరో ప్రభాస్‌, హీరోయిన్ దీపికా పదుకునే, అమితాబచ్చన్‌, కమల్‌ హాసన్‌ లు తీసుకున్న ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిభావంతుల సమూహం అంటూ సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫోటోను యూనిట్‌ సభ్యులు షేర్‌ చేశారు.

సినిమా విడుదల తర్వాత ఇప్పటి వరకు ఉన్న రికార్డులు అన్ని కూడా బ్రేక్‌ అయ్యే విధంగా వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులతో పాటు ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నమ్మకం గా కనిపిస్తున్నారు. రెండో ట్రైలర్ ను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.