Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ … మరో బిగ్ ప్లాన్ రెడీ

ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

By:  Tupaki Desk   |   24 Jun 2024 6:55 AM GMT
కల్కి 2898ఏడీ … మరో బిగ్ ప్లాన్ రెడీ
X

కల్కి 2898ఏడీ మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ చాలా స్ట్రాంగ్ గా చేస్తోంది. ఎక్కడా తగ్గకుండా మూవీ మీద క్రియేట్ చేసిన హైప్ ని పబ్లిక్ లోకి తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా కల్కి 2898ఏడీ రాక కోసం డార్లింగ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ సృష్టించిన ఫ్యూచర్ వరల్డ్ ని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.

ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ ట్రైలర్స్ ద్వారా కల్కి 2898ఏడీ ఎలా ఉండబోతోందనేది నాగ్ అశ్విన్ అండ్ కో ఒక స్పష్టత ఇచ్చారు. దీంతో పబ్లిక్ లో మూవీపైన ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కచ్చితంగా ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కల్కి 2898ఏడీ రాబోతోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకునే పాల్గొని మూవీ గురించి మాట్లాడారు. అలాగే అశ్వినీదత్, స్వప్నదత్, ప్రియాంకదత్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే కల్కి టీమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈవెంట్ నిర్వహిస్తుందని అందరూ భావించారు.

ఈ మధ్యకాలంలో మీడియాతో నిర్వహించే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈవెంట్ బాగా పాపులర్ అయ్యింది. అందుకే కల్కి టీమ్ కూడా నిర్వహిస్తుందని భావించారు. అయితే స్వప్నదత్, ప్రియాంక దత్ ఆలోచన మరో విధంగా ఉందంట. రిలీజ్ కి ముందు ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారంట. అయితే అది ఎలా చేయాలనే దానిపై ప్లానింగ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ ఈవెంట్ తో కల్కి మూవీ ప్రమోషన్స్ ని ఎండ్ చేయాలని అనుకుంటున్నారు. జూన్ 27న మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కల్కి 2898ఏడీ హంగామా మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. చూస్తుంటే మొదటిరోజే ప్రభాస్ మరో బిగ్ రికార్డ్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా సినిమా ప్రీమియర్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండబోతునట్లు తెలుస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా ప్రత్యేకమైన పాత్రలలో మెప్పించబోతున్నారు. మరి ఇంత స్టార్ క్యాస్ట్ ఉన్న కల్కి మూవీ థియేటర్స్ లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందనేది చూడాలి.