Begin typing your search above and press return to search.

కల్కిలో 'ది లక్కీ రెబల్'.. ఎవరబ్బా ఈ అందం?

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రూ.600 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Jun 2024 10:17 AM GMT
కల్కిలో ది లక్కీ రెబల్.. ఎవరబ్బా ఈ అందం?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ మరో వారం రోజుల్లో విడుదల కానుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను రూ.600 కోట్లకుపైగా భారీ బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా సినీ ప్రియులతోపాటు ప్రభాస్ ఫ్యాన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు నెలకొనగా.. వాటిని మేకర్స్ భారీగా పెంచేస్తున్నారు. కొంగొత్తగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు.


ఈ సినిమాలో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందంతో పాటు పలువురు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూవీలో వీరు కాకుండా అనేక మంది క్యామియో రోల్స్ పోషిస్తున్నారు. వారిలో ఒక్కొక్కరి లుక్స్ ను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల సీనియర్ బ్యూటీ శోభన లుక్ రివీల్ చేయగా.. రీసెంట్ గా మాలీవుడ్ బ్యూటీ అన్నా బెన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్.

కల్కిలో అన్నా బెన్.. కైరా రోల్ పోషిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ది లక్కీ రెబల్ అంటూ పోస్టర్ ను షేర్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఆ పోస్టర్ వైరల్ గా.. ఆమె కోసం తెగ వెతికేస్తున్నారు సినీ ప్రియులు. దీంతో అన్నా బెన్ గురించి పలు విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలకు గాను ఏదో ఒక అవార్డు అందుకునే ఉంది అన్నా. దీంతో ఈ విషయం తెలిసి అంతా షాక్ అయిపోతున్నారు!

కేరళలోని కొచ్చికి చెందిన అన్నా బెన్.. సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచే మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పలు మలయాళం, తమిళ సినిమాలకు స్క్రీన్‌ రైటర్‌ గా వర్క్ చేసిన బెన్నీ పి. నాయరాంబలం వారసురాలిగా 'కుంబలంగి నైట్స్‌' మూవీతో హీరోయిన్ గా మారింది. తొలి సినిమాకు సైమాతోపాటు కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు అందుకుంది. ఆ తర్వాత వరుసగా హెలెన్, కప్పేలా, నారదన్ వంటి అనేక సినిమాల్లో యాక్ట్ చేసింది అన్నా.

అయితే మాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న అన్నా బెన్.. కొట్టుక్కాళి మూవీతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంతో తమిళ సినీ ప్రియులను అలరించింది. ఇప్పుడు కల్కి 2898 ఏడీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టనుంది. ఇప్పటికే ఆమె నటించిన కప్పేలా మూవీ తెలుగులో రీమేక్ అవ్వగా.. అనికా సురేంద్రన్ యాక్ట్ చేసింది. మరి కల్కి సినిమాతో అన్నా బెన్ ఎలా అలరిస్తుందో? ఇక్కడ ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.