Begin typing your search above and press return to search.

ఆల్‌ ది బెస్ట్‌... హాలీవుడ్‌ మూవీకి మన భైరవ

సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డెడ్‌పూల్ & వుల్వరైన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Tupaki Desk   |   26 July 2024 8:00 AM GMT
ఆల్‌ ది బెస్ట్‌... హాలీవుడ్‌ మూవీకి మన భైరవ
X

సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డెడ్‌పూల్ & వుల్వరైన్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమా కోసం ఇండియన్‌ సినీ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.


డెడ్‌పూల్ & వుల్వరైన్ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో పలువురు ఇండియన్‌ సినీ ప్రముఖులు కూడా తమ సోషల్‌ మీడియా వాల్స్ పై పోస్ట్‌ చేసి మరింతగా అంచనాలు పెంచారు. తాజాగా కల్కి 2898 ఏడీ సినిమా మేకర్స్ కూడా తమ బెస్ట్‌ విషెష్‌ ను తెలియజేస్తూ పోస్ట్‌ చేశారు.

సోషల్‌ మీడియా ద్వారా మా భైరవ తరపున డెడ్‌పూల్ & వుల్వరైన్ సినిమాకు బెస్ట్‌ విషెష్ అంటూ టీమ్ కల్కి తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డెడ్‌పూల్ & వుల్వరైన్ హీరోల మధ్య భైరవ లుక్ లో ప్రభాస్ ను చూస్తే హాలీవుడ్‌ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా మా హీరో ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. వారాలు గడచి పోతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి కంటిన్యూ అవుతోంది. వీకెండ్స్ లో కల్కి జోరు కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో వసూళ్ళ పరంగా కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో అమితాబచ్చన్‌, దీపికా పదుకునే, దిశా పటానీ, కమల్‌ హాసన్‌ ఇంకా పలువురు నటీ నటులు నటించారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కల్కి సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు చేయడం జరిగింది.