'కల్కి' చూడాలంటే థియేటర్‌కి వెళ్లాల్సిందే...!
ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ కి పరిచయం చేసే స్థాయిలో కల్కి సినిమా ఉంటుంది అంటూ ట్రైలర్ ను చూస్తే అనిపిస్తుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Desk | 22 Jun 2024 2:30 PM GMTప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. మరో మూడు రోజుల్లో విడుదల అవుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
దేశవ్యాప్తంగా మరే సినిమా పోటీ లేకుండా కల్కి విడుదల అవ్వబోతుంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో కల్కి సినిమా అంచనాలను ఆకాశానికి పెంచారు. ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ కి పరిచయం చేసే స్థాయిలో కల్కి సినిమా ఉంటుంది అంటూ ట్రైలర్ ను చూస్తే అనిపిస్తుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్నాళ్లుగా పెరిగిన టికెట్ల రేట్ల కారణంగా చాలా మంది సినీ ప్రేక్షకులు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ని కోరుకోవడం లేదు. ఫ్యామిలీతో సినిమాకు వెళ్తే రూ.2500 పట్టుకోవాలసి ఉంటుంది. కనుక ఓటీటీ లో సినిమా చూడాలని చాలా మంది భావిస్తున్నారు.
ఎంత పెద్ద హీరో సినిమా అయినా విడుదల అయిన మూడు నాలుగు వారాల్లో ఓటీటీ లో ఉంటుంది. కనుక హడావుడి లేకుండా సింపుల్ గా ఇంట్లో కూర్చుని ఓటీటీ లో సినిమాలను చూడటం అలవాటు చేసుకున్న ప్రేక్షకులకు కల్కి మేకర్స్ షాక్ ఇవ్వబోతున్నారు.
ప్రముఖ ఓటీటీ సంస్థ ఇప్పటికే కల్కి సినిమాను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కల్కి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి ఏకంగా 8 వారాల సమయం ఉండాలని ఒప్పందం జరిగిందట. సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా 50 రోజులు పూర్తి అయిన తర్వాతే స్ట్రీమింగ్ చేసుకోవాల్సి ఉంటుందట.
కల్కి సినిమా కోసం 8 వారాల పాటు ప్రేక్షకులు ఆగడం కష్టం. ఒక వేళ పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మొదటి వారం లేదా రెండో వారంలోనే చూడాలని అంతా కోరుకుంటారు. ఓటీటీ స్ట్రీమింగ్ కు ఎలాగూ ఎనిమిది వారాల సమయం ఉంటుంది కనుక కల్కి ని చూడాలంటే థియేటర్ కి వెళ్లాల్సిందే.