Begin typing your search above and press return to search.

కల్కి 2898ఏడీ టిక్కెట్ ధరలు… ఏపీలో కూడా పెరిగాయి

తాజాగా ప్రభుత్వం కల్కి టికెట్ ధరలు, షోల పెంపుపై జీవో జారీ చేసింది. దీంతో ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 3:47 AM GMT
కల్కి 2898ఏడీ టిక్కెట్ ధరలు… ఏపీలో కూడా పెరిగాయి
X

స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినపుడు టికెట్ ధరలు పెంచుకోవడం అనేది సాధారణంగా జరిగే విషయమే. ఈ ఏడాది ఒక్క గుంటూరు కారం సినిమాకి మాత్రమే టికెట్ ధరలు పెంచారు. దాని తర్వాత పెద్ద సినిమాలు ఏవీ థియేటర్స్ లోకి రాలేదు. ఆరు నెలల తర్వాత కల్కి2898ఏడీ రూపంలో తెలుగులో ఓ పెద్ద సినిమా ప్రేక్షకులని పలకరిస్తోంది. జూన్ 27న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే హైలెట్ అవుతున్నాయి. సినిమా నుంచి వచ్చిన ట్రైలర్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని పీక్ లోకి తీసుకొని వెళ్లిపోయాయి. దీంతో పబ్లిక్ కూడా కల్కి మూవీని థియేటర్స్ లో చూడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికి చాలా థియేటర్స్ హౌస్ ఫుల్ అయిపోయాయి. దీనిని బట్టి కల్కి 2898ఏడీ మూవీ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పొచ్చు.

ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్ కల్కి మూవీ టికెట్ ధరల్ని పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ కి ఒక ధర, మల్టీప్లెక్స్ లకి మరో ధరని నిర్ణయించారు. ఈ టికెట్ ధరలు అమల్లోకి రావడంతో తెలంగాణాలో అడ్వాన్స్ బుకింగ్స్ ని ఆన్ లైన్ లో ఓపెన్ చేశారు. తాజాగా ఏపీ గవర్నమెంట్ కూడా కల్కి 2898ఏడీ టికెట్ ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.

సింగిల్ స్క్రీన్స్ లో 75, మల్టీప్లెక్స్ లో 125 రూపాయిలు అదనంగా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఐదు షోలకి కూడా పర్మిషన్ ఇవ్వడం విశేషం. టికెట్ ధరలు, ఐదు షోల విధానం 14 రోజుల పాటు కొనసాగనున్నాయి. తాజాగా ప్రభుత్వం కల్కి టికెట్ ధరలు, షోల పెంపుపై జీవో జారీ చేసింది. దీంతో ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓపెన్ చేశారు.

టికెట్ ధరలు పెంపుతో కల్కి 2898ఏడీ మూవీకి మొదటి మూడు రోజులు భారీ కలెక్షన్స్ రావడం ఖాయం అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనేది పబ్లిక్ టాక్ మీద ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా కల్కి చిత్రానికి యునానమస్ గా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది.