Begin typing your search above and press return to search.

కల్కి 2898AD.. రిలీజ్ కు ముందు మరో సునామీ!

కచ్చితంగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా వండర్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని డార్లింగ్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 4:32 AM GMT
కల్కి 2898AD.. రిలీజ్ కు ముందు మరో సునామీ!
X

వైజయంతీ మూవీస్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో సిద్ధమైన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాసే చిత్రం కల్కి 2898ఏడీ అవుతుందని ట్రైలర్ చూసిన తర్వాత సినీ విశ్లేషకులు చెబుతున్న మాట.

కచ్చితంగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా వండర్స్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని డార్లింగ్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ట్రైలర్ లో నాగ్ అశ్విన్ ప్రతి ఎలిమెంట్ కి కవర్ చేసి మూవీ ఎలా ఉండబోతోందనేది మూడు నిముషాల్లో చెప్పారు. లీడ్ రోల్ చేస్తున్న అందరిని ట్రైలర్ లో ఆవిష్కరించారు. ముఖ్యంగా అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మూవీలో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని అర్ధమవుతోంది.

అలాగే భైరవ పాత్రలో ప్రభాస్ ఓ వైపు హ్యూమర్ క్రియేట్ చేస్తూనే మరో వైపు యాక్షన్ సీక్వెన్స్ లతో ఇరగదీసాడు అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. తెలుగువారందరూ గర్వంగా చెప్పుకునే మూవీ కల్కి 2898 ఏడీ అవుతుందనే టాక్ నడుస్తోంది. ఈ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. మూవీని గ్రాండియర్ గా రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా వచ్చిన ట్రైలర్ తో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్ సాలిడ్ గా జరుగుతాయని బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కల్కి 2898 ఏడీ రిలీజ్ కి వారం రోజుల ముందు సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడానికి నాగ్ అశ్విన్ టీం ప్లాన్ చేస్తున్నారంట. రెండు ట్రైలర్స్ కట్ చేసి సెన్సార్ కి పంపించి క్లియరెన్స్ తెచ్చుకున్నారంట.

రెండో ట్రైలర్ ని రిలీజ్ ముందుకి ప్రేక్షకులకి అందిస్తే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారంట. తాజా ట్రైలర్ తో వచ్చిన బజ్ ని కొనసాగిస్తూ ఇకపై మరింత అగ్రెసివ్ గా మూవీ ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ చేయబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడీగా దిశా పటాని నటించింది. అలాగే కల్కికి జన్మనిచ్చే తల్లిగా దీపికా పదుకునే పాత్ర మూవీలో చాలా కీలకంగా ఉండబోతోంది.