Begin typing your search above and press return to search.

కల్కి ట్రైలర్ సెన్షేషన్.. అప్పుడే 20 మిలియన్లకు పైగా..

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jun 2024 10:17 AM GMT
కల్కి ట్రైలర్ సెన్షేషన్.. అప్పుడే 20 మిలియన్లకు పైగా..
X

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడీ మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో వేరే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. హాలీవుడ్ లెవెల్ లో సినిమా ఉండనున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందా? ఎప్పుడు చూసేద్దామా? అని ఆడియన్స్ తహతహలాడుతున్నారు.

ఇక రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన సెకండ్ ట్రైలర్.. వేరే లెవెల్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఫిదా చేస్తోంది. విస్మయపరిచే విజువల్స్, అత్యాధునిక VFX, అదిరిపోయే యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఉన్న ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యూట్యూబ్ లో టాప్ ప్లేస్ కొట్టేసి వ్యూస్ సునామీ సృష్టిస్తోంది. రిలీజైన ఒక్కరోజులోనే వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది.

మేకర్స్ విడుదల చేసి 24 గంటలు కూడా గడవక ముందే 20 మిలియన్లకు పైగా వ్యూస్ ను కల్కి సెకండ్ ట్రైలర్ దక్కించుకుని సత్తా చాటుతోంది. యూట్యూబ్ లో ట్రైలర్ సునామీ చూశాక.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. ట్రైలర్ లోని ప్రతి సీన్ కూడా విజువల్ ఫీస్ట్ లా ఉంది. హాలీవుడ్ రేంజ్ ఎఫెక్టులతో అలరిస్తున్నాయి. నాగి సృష్టించిన కాశీ, కాంప్లెక్స్, శంభాలా ప్రపంచాలు ఆడియన్స్ ఊహకందని రీతిలో ఉన్నాయి.

ప్రతి ఒక్క ప్రపంచంలో చాలా ప్రత్యేకంగా, ఆశ్చర్యపరిచే విధంగా కనిపిస్తున్నాయి. మేకర్స్.. వాటికి సృజనాత్మకతతో జీవం పోశారు. లైవ్- యాక్షన్ ఎలిమెంట్స్‌ తో గ్రాఫిక్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు హైలెట్ గా నిలవనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఫ్యూచరిస్టిక్ వెహికల్స్, వెపన్స్ వేరే లెవెల్ లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్ కూడా సరైన విధంగా, లోతుగా ఉండనున్నట్లు అర్థమవుతోంది.

మొత్తానికి ఓవరాల్ గా సెకండ్ ట్రైలర్.. ఈ సినిమాకు బిగ్ బూస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కల్కి సినిమా కొత్త రికార్డులు సృష్టించనుందని చెప్పడానికి ఈ ట్రైలరే ఉదాహరణ. సినిమాపై వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ ఆడియన్స్ అంచనాలను ఆకాశానికి టచ్ అయ్యేలా చేసింది కొత్త ట్రైలర్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.