యూఎస్ లో దుమ్ములేపుతున్న కల్కి
కల్కి 2898ఏడీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 77,777 టికెట్లు అమ్ముడయ్యాయని మరో పోస్టర్ తో చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది.
By: Tupaki Desk | 23 Jun 2024 6:50 AM GMTయూఎస్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేస్తోంది కల్కి 2898ఏడీ. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఓవర్సీస్ లో మార్కెట్ ఉంది. అతని సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటారు. ప్రీమియర్ షోలతోపాటు రెండు, మూడు రోజుల వరకు టికెట్స్ ని ముందస్తుగా కొనేస్తారు.
నార్త్ అమెరికాలో ఎక్కువగా ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్ మన సినిమాలు చూడటానికి ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకి 2.5 నుంచి 3 మిలియన్స్ కలెక్షన్స్ రిలీజ్ కి ముందే వచ్చేస్తాయి. ఆ స్థాయిలో డార్లింగ్ కి నార్త్ అమెరికాలో ఫాలోయింగ్ ఉంది.
ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడీ జూన్ 27న థియేటర్స్ లోకి వస్తోంది. ఒక్క రోజు ముందుగానే యూఎస్ లో స్పెషల్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈ ప్రీమియర్ షోల టికెట్స్ అల్ మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పటికే మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 2.5 మిలియన్ డాలర్స్ వసూళ్లు అయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.
కల్కి 2898ఏడీ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు 77,777 టికెట్లు అమ్ముడయ్యాయని మరో పోస్టర్ తో చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. దీని బట్టి యూఎస్ లో ఈ మూవీకి ఏ స్థాయిలో ఆదరణ లభిస్తుందో చెప్పొచ్చు. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఏ ఒక్క హీరో సినిమాకి ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా టికెట్లు అమ్ముడుపోలేదని తెలుస్తోంది. ఇది ఓ విధంగా రేర్ రికార్డ్ అని చెప్పొచ్చు.
కల్కి 2898ఏడీ మూవీకి ఉన్న క్రేజ్, ప్రభాస్ మాస్ ఇమేజ్ కారణంగానే ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ అయ్యాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కల్కి 2898ఏడీ చిత్రాన్ని యూఎస్ లో ఏఏ క్రియేషన్స్, ప్రత్యంగిర సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందనేది వేచి చూడాలి. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా దిశా పటాని నటిస్తోంది. దీపికా పదుకునే కీలక పాత్రలో కనిపిస్తోంది. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామగా నటించారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా చేశారు.