ఆరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి థియేటర్ లో ఆ సినిమానే..?
ఇదిలాఉంటే తెలుగులో జూన్ 27న కల్కి ప్రభంజనం సృష్టించడానికి సిద్ధం అవుతుంది.
By: Tupaki Desk | 8 Jun 2024 4:02 AM GMTతెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు బాహుబలి తర్వాత మళ్లీ ప్రభాస్ తోనే కల్కి అంటూ మరో ప్రయత్నం జరిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ వండర్ గా రాబోతుందని తెలుస్తుంది. కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కల్కి 2898 AD సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ రేంజ్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలాఉంటే తెలుగులో జూన్ 27న కల్కి ప్రభంజనం సృష్టించడానికి సిద్ధం అవుతుంది.
జూన్ 27న కల్కికి పోటీగా ఏ తెలుగు సినిమా రిలీజ్ అవ్వట్లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్ అన్ని థియేటర్లలో కల్కి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 90% థియేటర్స్ లో కల్కిని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అదీగాక ఏపీలో ఎలాగు నిర్మాత దత్ కి సపోర్ట్ చేసే గవర్నమెంట్ ఉంది కాబట్టి టికెట్ రేట్లు, బెనిఫిట్ షోస్ విషయంలో రాజీ పడే ఛాన్స్ లేదు.
సో జూన్ 27న అటు ఏపీలో ఇటు తెలంగాణాలో రెండు రాష్ట్రాల్లో కల్కి మేనియా ఉండబోతుంది. తెలుగు నుంచి కల్కి కి పోటీగా వచ్చే సినిమాలు ఉండకపోవచ్చు ఇతర భాషల సినిమాలకు అంత ప్రియారిటీ ఇచ్చే ఛాన్స్ లేదు. సో జూన్ 27 కల్కి హంగామా చూడబోతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో వావ్ అనిపిస్తున్న కల్కి థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అందిస్తుందని చెప్పొచ్చు.
ప్రభాస్ కల్కి సినిమాతో హాలీవుడ్ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంటాడని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కల్కి మీద ఇంటర్నేషనల్ ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. సో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే కల్కి వండర్స్ క్రియేట్ చేయడం పక్కా అని చెప్పొచ్చు. కల్కి కి ఫ్రాంచైజీలను ప్రకటించిన నాగ్ అశ్విన్ మొత్తానికి చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అర్ధమవుతుంది. కల్కి సినిమాను వైజయంతి మూవీస్ 500 కోట్ల పైన బడ్జెట్ ని కేటాయించింది. సినిమాకు పెట్టిన ప్రతి పైసా కూడా తెర మీద కనిపించేలా విజువల్ ట్రీట్ అందిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే కల్కి ప్రీల్యూడ్ గా వదిలిన యానిమేటెడ్ సీరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.