Begin typing your search above and press return to search.

సమయం సరిపోతుందా 'కల్కి'...?

ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా ఎన్నికలు, ఐపీఎల్‌ ఇతర కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది.

By:  Tupaki Desk   |   28 May 2024 11:30 PM GMT
సమయం సరిపోతుందా కల్కి...?
X

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే హీరోయిన్ గా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 ఏడి సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా ఎన్నికలు, ఐపీఎల్‌ ఇతర కారణాల వల్ల వాయిదా వేయడం జరిగింది.

జూన్‌ 27న కల్కి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రమోషన్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ మరియు బయ్యర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది.

ఇప్పటి వరకు కల్కి మెయిన్‌ పాయింట్‌ ఏంటి అనే విషయాన్ని రివీల్‌ చేయలేదు. సరే దాన్ని రివీల్‌ చేయకుండానే ఉంచుతారు అనుకున్నా కూడా మెయిన్‌ లీడ్‌ కు సంబంధించిన ప్రమోషన్‌ చేయలేదు. సినిమాలో కీలకమైన కారు బుజ్జీని భారీ గా ఈవెంట్‌ నిర్వహించి మరీ పరిచయం చేయడం జరిగింది.

కీర్తి సురేష్ వాయిస్‌ ఓవర్‌ తో వచ్చిన బుజ్జీ పరిచయం వీడియో కు మంచి స్పందన దక్కింది. అయితే కల్కి బడ్జెట్‌ రేంజ్ కి, టార్గెట్‌ వసూళ్లను రీచ్‌ అవ్వాలంటే ప్రమోషన్ అది సరిపోదు అనేది కొందరి అభిప్రాయం. ఆ విషయం పక్కన పెడితే నెల రోజుల సమయం కూడా లేదు కల్కి ప్రమోషన్‌ ఎంత వరకు చేయగలరు అనే చర్చ కూడా జరుగుతుంది.

ఏపీ అసెంబ్లీ మరియు పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు జూన్ మొదటి వారంలో రానున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వస్తుందని కల్కి నిర్మాతలు ఆశగా ఉన్నారు. ఒక వేళ అక్కడ ప్రభుత్వం మారకుంటే మాత్రం కల్కి సినిమా మేకర్స్‌ విడుదల ప్లాన్స్ ఏమైనా చేంజ్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కల్కి సినిమా ను దాదాపుగా రూ.700 కోట్ల బడ్జెట్‌ తో రూపొందించారు. ఇప్పటికే నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా దాదాపుగా రూ.400 కోట్ల నుంచి రూ.450 కోట్ల వరకు రాబట్టినట్లుగా సమాచారం అందుతోంది. ఇక థియేటర్ లో విడుదల తర్వాత రూ.2000 కోట్ల టార్గెట్‌ కల్కి ముందు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఇంతటి హైప్‌ క్రియేట్‌ చేసిన కల్కి సినిమా ను విడుదల ముందు ఇంకాస్త ఎక్కువగానే ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రమోషన్‌ మొదలు పెడదాం అంటే కనీసం మూడు వారాలు కూడా నిండా ఉండదు. కనుక ఆ సమయం సరిపోతుందా అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. మేకర్స్‌ మాత్రం ఇప్పటికే రావాల్సిన క్రేజ్‌, దక్కాల్సిన పబ్లిసిటీ దక్కింది. కనుక ప్రత్యేకంగా భారీగా ప్రమోషన్‌ చేయాల్సిన పని లేదు అన్నట్లుగా ఆఫ్ ది రికార్డ్‌ కామెంట్స్ చేస్తున్నారు.