Begin typing your search above and press return to search.

కల్కి హిందీ లెక్క.. మరో 7 కోట్లు తెచ్చిందంటే..

కల్కి 2898ఏడీ మూవీ వీకెండ్ నాటికి ఆర్ఆర్ఆర్ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   20 July 2024 6:02 AM GMT
కల్కి హిందీ లెక్క.. మరో 7 కోట్లు తెచ్చిందంటే..
X

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ నుంచి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కల్కి 2898ఏడీ మూవీగా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ ఇప్పటికే క్రాస్ చేసిన కల్కి మూవీ లాంగ్ రన్ లో 1100-1200 కోట్ల మధ్యలో కలెక్షన్స్ ని అందుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ స్టామినాని కల్కి మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా మేజర్ సక్సెస్ క్రెడిట్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని అందరూ ఇస్తున్నారు. అయితే సినిమాకి అద్భుతమైన ఓపెనింగ్స్ రావడానికి కారణం మాత్రం డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ అని కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.

తరువాత సినిమాలోని క్యారెక్టర్స్ అందరికి కనెక్ట్ అయ్యాయి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వద్ధామ క్యారెక్టర్ అయితే ప్రేక్షకులకి బాగా నచ్చింది. అలాగే ప్రభాస్ ని కర్ణుడిగా రిప్రజెంట్ చేయడం కూడా సినిమాలో ఒక ఇంటరెస్టింగ్ ఫ్యాక్టర్ గా పనిచేసింది. సుమతి పాత్రలో దీపికా పదుకునే పెర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉందని చెప్పాలి. ఓవరాల్ గా రిలీజ్ అయిన అన్ని భాషలలో కల్కి 2898ఏడీ సినిమాకి అపూర్వ ఆదరణ లభించింది.

ఇదిలా ఉంటే హిందీలో కల్కికి పోటీ ఇచ్చే సినిమా ఈ మూడు వారాల్లో ఒక్కటి కూడా రాలేదు. అక్షయ్ కుమార్ సర్ఫిరా మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఎందుకనో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదు. ఈ రెండు సినిమాలు కల్కి మూవీ సృష్టించిన తుఫాన్ కి ఎవరు ఎదురెళ్లలేకపోయారు. నార్త్ ఇండియన్ బెల్ట్ లో ఇప్పటి వరకు కల్కి సినిమాకి 267.65 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

ఈ ఏడాది కల్కి సినిమాకి ఇప్పటి వరకు బాలీవుడ్ లో రిలీజ్ ఆయిన అన్ని మూవీస్ కంటే హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. విక్కీ కౌశల్ ‘బ్యాడ్ న్యూస్’ మూవీ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. దీంతో కల్కి మూవీ బుకింగ్స్ కొంత తగ్గాయి. అయితే శని, ఆదివారాలు మళ్ళీ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది.

కల్కి 2898ఏడీ మూవీ వీకెండ్ నాటికి ఆర్ఆర్ఆర్ సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది. హిందీలో ఆర్ఆర్ఆర్ 275 కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ప్రస్తుతం కల్కి మూవీ మూవీ 7.35 కోట్ల కలెక్షన్స్ దూరంలో ఉంది. శని, ఆదివారాలు కల్కి సినిమా వసూళ్లు పెరిగితే ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డ్ ని కల్కి బ్రేక్ చేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.