Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్యూట్‌ గా హలో చెప్తున్న బ్యూటీ

మరో వైపు ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన ఫ్యామిలీ ఈవెంట్‌ ఫోటోలు షేర్‌ చేసింది.

By:  Tupaki Desk   |   8 March 2024 2:30 AM GMT
పిక్ టాక్ : క్యూట్‌ గా హలో చెప్తున్న బ్యూటీ
X

అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన హలో సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ కల్యాణీ ప్రియదర్శన్. ఈ అమ్మడు తెలుగు లో మొదటి సినిమాతోనే కమర్షియల్‌ గా నిరాశ పరిచింది. అయితే ఇతర భాషల్లో ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.

రణరంగం తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న కళ్యాణీ ప్రియదర్శన్‌ తమిళ మరియు మలయాళ సినిమాలతో బిజీ బిజీగా ఉంటుంది. మరో వైపు ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన ఫ్యామిలీ ఈవెంట్‌ ఫోటోలు షేర్‌ చేసింది.

ఫ్యామిలీ ఈవెంట్ లో కళ్యాణీ ప్రియదర్శన్‌ చాలా క్యూట్‌ గా ఉన్న సోలో ఫోటోలను కూడా షేర్‌ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు క్యూట్ ఎక్స్‌ ప్రెషన్స్‌ తో హలో చెబుతున్నట్లుగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంత అందంగా ఉన్న కళ్యాణీ ప్రియదర్శన్ ను తెలుగు ప్రేక్షకులు మిస్‌ అవుతున్నారు. ముందు ముందు మళ్లీ అమ్మడు సినిమాలు తెలుగు లో చేయాలని కోరుకుంటున్నారు. మరి ఈ అమ్మడికి తెలుగు ఫిల్మ్‌ మేకర్స్ ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి.