Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ డెసిషన్.. ఎఫెక్ట్ పడుతుందా..?

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా టైటిల్ పోస్టర్ ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 March 2025 5:01 PM IST
కళ్యాణ్ రామ్ డెసిషన్.. ఎఫెక్ట్ పడుతుందా..?
X

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా టైటిల్ పోస్టర్ ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అర్జున్ సన్నాఫ్ వైజయంతి గా కళ్యాణ్ రామ్ రాబోతున్నాడు. ఈ సినిమాలో ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నారు. సినిమాలో కళ్యాణ్ రామ్ మదర్ గా పోలీస్ పాత్రలో ఆమె నటిస్తున్నారు. మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత విజయశాంతి చేస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ తోనే ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా టైటిల్ ని అర్జున్ సన్నాఫ్ వైజయంతి అని పెట్టమని కళ్యాణ్ రామ్ సజెస్ట్ చేశాడట. అసలైతే ముందు వేరే టైటిల్ అనుకోగా వైజయంతి యాడ్ చేయమని ఆయన చెప్పారట. ఈమధ్య సినిమా టైటిల్స్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా ఉంటేనే చూస్తున్నారు.

ఈ క్రమంలో కళ్యాణ్ రామ్ దర్శక నిర్మాతలు ఈ సినిమాకు ముందు వేరే టైటిల్ అనుకోగా ఫైనల్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి అని లాక్ చేశారు. ఐతే కథ మీద ఉన్న నమ్మకంతోనే కళ్యాణ్ రామ్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఐతే ఈ నిర్ణయం సినిమాకు ఏమేరకు హెల్ప్ అవుతుంది అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది. కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్ లో వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన మేజర్ సినిమా హీరోయిన్ సయి మంజ్రేకర్ నటిస్తుంది. అంతేకాదు సినిమాలో శ్రీకాంత్ కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బింబిసార సినిమాతో సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ లాస్ట్ ఇయర్ డెవిల్ అంటూ వచ్చి నిరాశపరిచాడు. మరి ఈ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

నందమూరి హీరోగా కళ్యాణ్ రామ్ తన పంథాలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఐతే కళ్యాణ్ రామ్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం అది సూపర్ హిట్ కొట్టినట్టే లెక్క. సినిమాలను ఎంతో ప్రయోగాత్మకంగా చేయాలన్న కళ్యాణ్ రామ్ ఎఫర్ట్స్ కి తగిన ప్రఫితలం అయితే రావట్లేదని చెప్పొచ్చు.