అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందంటే..
నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే సినిమా ప్రత్యేకంగా నిలవబోతున్నట్లు అర్ధమవుతుంది.
By: Tupaki Desk | 11 April 2025 3:30 PMనందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే సినిమా ప్రత్యేకంగా నిలవబోతున్నట్లు అర్ధమవుతుంది. కథ విన్న మొదటి రోజునుంచి కళ్యాణ్ రామ్‌కు ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ మామూలుగా లేదట. ప్రతి అడుగులోనూ, క్యాస్టింగ్ నుండి షూటింగ్ వరకూ, ప్రోమోషన్ వరకు.. అతను సొంత సినిమాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇది ఒక మామూలు ప్రాజెక్ట్ కాదు, కళ్యాణ్ రామ్ వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యేలా ఉన్న కథ కావడమే కారణం.
ఈ సినిమాలో విజయశాంతిని తల్లి పాత్రకు తీసుకోవడం బిగ్ అడ్వాంటేజ్ గా మారింది. ఆమెకు కథ నచ్చితేనే ఓకే చెబుతారు. అలాంటి సీనియర్ లెజెండ్ ఓ మదర్ క్యారెక్టర్‌కు ఓకే చెప్పింది అంటే.. ఈ కథలోని కంటెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. విజయంలో కీలకమైన ఎమోషన్, తల్లి కొడుకు మధ్య బంధం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ నటనకు మంచి స్కోప్ ఉందని టాక్ వినిపిస్తోంది.
అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ ఒక బాధ్యతగల కుమారుడిగా కనిపించనున్నాడు. కుటుంబాన్ని కాపాడే కోణంలో ఆయన దూకుడు, సెంటిమెంట్ రెండు కలిసి కలబోతగా నడవబోతున్నాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో పాటు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆయన స్టైల్‌కు తగ్గట్టుగానే ఉండనున్నాయి. ఇదంతా చూడటానికి స్క్రీన్ మీద క్లాస్ అండ్ మాస్ కలయిక అనే ఫీల్‌ను ఇవ్వబోతోందన్న అభిప్రాయం ట్రేడ్ సర్కిల్స్ లో వ్యక్తమవుతోంది.
ఇప్పటికే ప్రోమోషన్లలో కళ్యాణ్ రామ్ యాక్టివ్ గా పాల్గొంటున్న తీరు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. కొన్ని రోజులుగా ప్రెస్ మీట్లు, ట్రావెల్ ప్రోగ్రామ్స్, కాలేజీ ఈవెంట్లలో ఆయన పాల్గొంటూ సినిమాపై హైప్‌ను పెంచుతున్నారు. ఇంతకాలం గ్యాప్ తర్వాత బిజీగా ప్రచారం చేస్తున్న కళ్యాణ్ రామ్ ను చూసి అభిమానులు ఆనందంగా ఫ్లెక్సీలు, ర్యాలీలతో మద్దతు తెలియజేస్తున్నారు. ఆయన నమ్మకమే ఇప్పుడు సినిమా సక్సెస్ కీగా మారబోతోంది.
ఈ సినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్నాడు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బాలుసు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఇక ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల కాబోతోంది. ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదలతో అర్జున్ క్రేజ్ మరో స్థాయికి చేరనుంది. ఇక బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.