Begin typing your search above and press return to search.

NKR21: కళ్యాణ్ రామ్ హై వోల్టేజ్ యాక్షన్

ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి వైజయంతీ ఐపీఎస్ గా కనిపించబోతోంది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 1:17 PM GMT
NKR21: కళ్యాణ్ రామ్ హై వోల్టేజ్ యాక్షన్
X

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఒక కమర్షియల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. NKR21 వర్కింగ్ టైటిల్ తో రెడీ అవుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి వైజయంతీ ఐపీఎస్ గా కనిపించబోతోంది. ఆమె క్యారెక్టర్ ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందంట.

సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత విజయశాంతి చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ఒకప్పటి విజయశాంతిని మరల ప్రేక్షకులు చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే ఆమె క్యారెక్టర్ టీజర్ ని రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ కూడా ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా నుంచి కీలక అప్డేట్ ని మేకర్స్ రివీల్ చేశారు.

ప్రస్తుతం NKR21కి సంబందించిన కీలకమైన యాక్షన్ ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫ్రీలో భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సీక్వెన్స్ లో ఏకంగా 150 మంది ఫైటర్స్ 300 మంది జూనియర్ ఆర్టిస్ట్స్ పాల్గొన్నారు. 15 రోజుల పాటు ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ జరుగుతుందని మేకింగ్ ఫోటోలు రిలీజ్ చేసి తెలియజేశారు. ఈ ఫోటో పీటర్ హెయిన్స్ మైక్ పట్టుకొని యాక్షన్ ఘట్టాలు తెరకెక్కిస్తున్నట్లు ఉంది.

ఈ వర్కింగ్ స్టిల్ NKR21 సినిమాపై నందమూరి అభిమానుల్లో అంచనాలు అమాంతం పెంచేసాయని చెప్పాలి. ఈ మూవీలో సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సోహైల్ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. శ్రీకాంత్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాకి కాంతారా, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు.

ముప్పా వెంకయ్య చౌదరి NKR21 సినిమాకి సమర్పకుడిగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందంట. విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చాలా కాలం తర్వాత కనిపిస్తూ ఉండటంతో మూవీపైన అంచనాలు పెరిగాయి. కచ్చితంగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు.