NKR 21.. నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా..
దీంతో ఇప్పుడు NKR 21 ప్రాజెక్టుతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు.
By: Tupaki Desk | 2 March 2025 5:45 AM GMTటాలీవుడ్ టాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు NKR 21 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చివరగా.. డెవిల్ తో వచ్చిన కళ్యాణ్ రామ్ నటుడిగా ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేస్తాడని నిరూపించారు. దీంతో ఇప్పుడు NKR 21 ప్రాజెక్టుతో మంచి హిట్ కొట్టాలని చూస్తున్నారు.
అందుకు తగ్గట్లే కష్టపడుతున్నారు. ప్రతీ విషయంలో కేర్ తీసుకుంటున్నారని ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్ తో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
అయితే ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ అందుకుంది. మూవీపై వేరే లెవెల్ బజ్ క్రియేట్ అయ్యి ఉంది. దీంతో మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
సినిమా అవుట్ పుట్ వేరే లెవెల్ లో వచ్చినట్లు ఇండస్ట్రీలో అంతా మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలవనుందని చెబుతున్నారు. అన్ని విషయాల్లో మేకర్స్ పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారని డిస్కస్ చేసుకుంటున్నారు. దీంతో ఆ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
అయితే మొన్న అతనొక్కడే.. నిన్న బింబిసార.. నేడు NKR 21.. అని చెబుతున్నారు. గుర్తుపెట్టుకోండి సినిమా రిలీజ్ తర్వాత మాట్లాడుకుందామని అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమా లోడింగ్ అంటూ సందడి చేస్తున్నారు. అలా ప్రస్తుతం సోషల్ మీడియాలో NKR 21 గురించి జోరుగా చర్చ నడుస్తోంది.
నిజానికి.. అతనొక్కడే, బింబిసార కళ్యాణ్ రామ్ లో మంచి హిట్ మూవీస్ గా నిలిచాయి. అతనొక్కడేతో సెన్సేషనల్ హిట్ ను అందుకున్నారు. నిర్మాతగానూ లాభాలు ఆర్జించారు. ఆ తర్వాత కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ సంబంధాలు లేకుండా ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇక బింబిసారతో బిగ్గెస్ట్ హిట్ సాధించారు. తన యాక్టింగ్ తో మెప్పించారు. ఇప్పుడు NKR 21తో మరో విజయాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.