అలాంటి వారిని కళ్యాణ్ రామ్ ఎక్కడ్నుంచి పట్టుకొస్తాడో తెలీదు
కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది.
By: Tupaki Desk | 16 March 2025 7:00 PM ISTనందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతీ. కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. విజయశాంతి ఈ సినిమాలో వైజయంతి ఐపీఎస్ పాత్రలో నటిస్తోంది. ఆమె కొడుకుగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో కనిపించనున్నాడు.
టాలీవుడ్ లో లేడీ పోలీసాఫీసర్ పాత్ర అనగానే ముందు గుర్తొచ్చేది విజయశాంతినే. కర్తవ్యం సినిమాలో ఆమె చేసిన వైజయంతి అనే పాత్ర అందరికీ గుర్తుండిపోయింది. ఆ పాత్రకు విజయశాంతి ఏకంగా నేషనల్ అవార్డు అందుకుందంటే ఆమె నటన, ఆ పాత్ర స్థాయి అర్థం చేసుకోవచ్చు. ఆ పాత్రను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో కూడా ఆమె పేరు వైజయంతి అనే పెట్టారు.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్టు పూర్తి చేసుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి రిలీజ్ డేట్ ను త్వరలోనే మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఏప్రిల్ 17 లేదా 18న సినిమాను రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే కళ్యాణ్ రామ్, విజయశాంతి ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ పై విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. బాబు మంచి కథలను, డైరెక్టర్లను ఎక్కడి నుంచి పట్టుకొస్తాడో కానీ ప్రతీ సినిమా హిట్ అవాలనే పట్టుదల, కసితో చేస్తాడని, ఈ సినిమాలో కూడా కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డాడు అని విజయశాంతి తెలిపారు.
సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సోహైల్ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తుండగా శ్రీకాంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు.