ప్రస్టేటెడ్ పీపూల్స్ కోసమే నేను!
తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ లో భాగంగా అసలి కథకు అంకురార్పణ ఎలా జరిగిందన్నది వివరించాడు. అదేంటో ఆయన మాటల్లోనే...
By: Tupaki Desk | 1 April 2025 8:30 AM'మ్యాడ్' సినిమాతో కల్యాణ్ శంకర్ డైరెక్టర్ గా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. కామెడీని కొత్తగా ట్రై చేసి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయడంలో వందశాతం విజయం సాధించాడు. కల్యాణ్ ఎంటర్ అయ్యే సరికే ఇండస్ట్రీలోకామెడీ సినిమాలు తగ్గిపోయాయి. అల్లరి నరేష్ కూడా డిఫరెంట్ యాక్షన్ జానర్లు ట్రై చేయడం తో పాటు, కామెడీ మేకర్లు కూడా పాత బడిపోవడంతో టాలీవుడ్ లో కామెడీ పనైపోయిందనుకున్నారంతా.
సరిగ్గా అదే సమయంలో 'మ్యాడ్' తో మంట పుట్టించాడు. అంతకు ముందే 'డీజే టిల్లు'తో విమల్ కృష్ణ కూడా మంచి కామెడీ చిత్రాన్ని అందించాడు. ఆ సినిమాకి మ్యాడ్ బూస్టింగ్ లా నిలిచింది. 'మ్యాడ్' కి సీక్వెల్గా 'మ్యాడ్ స్క్వేర్' కూడా ఇటీవల రిలీజ్ చేసిస సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. మరోసారి కల్యాణ్ శంకర్ కామెడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
అతడిలో ట్యాలెంట్ గుర్తించిన మాస్ రాజా రవితేజ పిలిచి మరీ తదుపరి సినిమాకి అవకాశం కూడా కల్పించారు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ లో భాగంగా అసలి కథకు అంకురార్పణ ఎలా జరిగిందన్నది వివరించాడు. అదేంటో ఆయన మాటల్లోనే... 'జనాల్లో ఈ మధ్య కోపం పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకే ప్రస్టేట్ అయిపోతున్నారు. అందుకు కారణాలు చాలా ఉండొచ్చు. కానీ ప్రస్టేషన్ తో సాధించేది ఏం లేదు. కోపం వల్ల ఇంకా సమస్యలు పెరుగుతాయే తప్ప తగ్గవు.
అందుకే అలాంటి వాళ్లను నవ్వించాలనే ఉద్దేశంతోనే కామెడీ సినిమాలు చేస్తున్నా. ప్రస్తుతం కామెడీ చిత్రాలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. కామెడీ సినిమా అయినా ఏమోషన్ అన్నది ప్రేక్షకుల ఊహకు అందని విధంగా ఉండాలి. ఇప్పుడది జరుగుతుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ అప్పుడది జరగకూడదు. దాన్ని కన్వెన్సింగ్ గా చెప్పగలగాలి. నేను కామెడీని అలాగే రాస్తాను. అదే నా బలం అని గట్టిగా నమ్ముతాను` అని అన్నారు.