కామెడీ డైరెక్టర్ అలాంటి జానర్‌ను హ్యాండిల్ చేయగలడా?
అయితే ఇప్పుడు కళ్యాణ్ శంకర్- రవితేజ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ అప్డేట్ బయటికొచ్చింది.
By: Tupaki Desk | 29 March 2025 9:30 AMహిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తుంటాడు మాస్ మహారాజా రవితేజ. కరోనా తర్వాత రవితేజ నుంచి ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజయ్యాయంటే రవితేజ ఎంత స్పీడ్ గా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. గతేడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ.
ఆ రెండు సినిమాలు రవితేజకు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. ఇంకా చెప్పాలంటే ధమాకా సినిమా తర్వాత రవితేజ కు హీరోగా మరో హిట్ లేదు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మాణంలో రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భాను భోగవరపు దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఆఖరి స్థితికి చేరుకుంది.
త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత నాగవంశీ ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే మాస్ జాతర తర్వాత రవితేజ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న సినిమా కాగా, మరొకటి మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా.
అయితే ఇప్పుడు కళ్యాణ్ శంకర్- రవితేజ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ అప్డేట్ బయటికొచ్చింది. మ్యాడ్ సినిమా చేస్తున్న టైమ్ లోనే కళ్యాణ్ శంకర్ తన బ్యానర్ లో మూడు సినిమాలు చేసేలా నాగవంశీ అగ్రిమెంట్ చేసుకున్నారని, ఈ నేపథ్యంలోనే మాస్ జాతర టైమ్ లో కళ్యాణ్ తో రవితేజకు కథ చెప్పించి ఆ ప్రాజెక్టును ఓకే చేయించారని సమాచారం.
ఇదిలా ఉంటే రవితేజతో కళ్యాణ్ శంకర్ చేయబోయే సినిమా గురించి రీసెంట్ గా మ్యాడ్ స్వ్కేర్ ప్రమోషన్స్ లో నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. సూపర్ హీరో జానర్ లో సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు నాగవంశీ. ఈ విషయం బయటికి వచ్చిన దగ్గర్నుంచి రవితేజ ఫ్యాన్స్ ఓ వైపు సంతోషపడుతున్నప్పటికీ, మరోవైపు టెన్షన్ పడుతున్నారు. ఇప్పటివరకు కేవలం కామెడీ ఎంటర్టైనర్లు మాత్రమే తీసిన కళ్యాణ్ శంకర్, రవితేజ లాంటి మాస్ హీరోని అది కూడా సూపర్ హీరో జానర్ లో సోషియో ఫాంటసీ డ్రామాను ఏ మేరకు హ్యాండిల్ చేయగలడని అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మరికొంత మంది ఫ్యాన్స్ మాత్రం ఈ ప్రాజెక్టు వెనుక నాగ వంశీ ఉన్నాడులే ఆయన చూసుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.