'మ్యాడ్ స్క్వేర్' విమర్శలపై డైరెక్టర్ కౌంటర్!
తాజాగా ఈ సినిమా దర్శకుడు కల్యాణ్ శంకర్ విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
By: Tupaki Desk | 2 April 2025 8:33 AMఇటీవల రిలీజ్ అయిన `మ్యాడ్ స్క్వేర్` దిగ్విజయంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 'మ్యాడ్' కి సీక్వెల్ గా కళ్యాణ్ శంకర్ తెరెక్కించిన సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఇప్పటికే సినిమా 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. వంద కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదే కాన్పిడెన్స్ తో నిర్మాత నాగవంశీ నా సినిమాని ఎవరూ ప్రమోట్ చేయకపోయినా తానే ప్రచారం చేసుకుని రిలీజ్ చేసుకుంటానని ధీమా వ్యక్తం చేసాడు. సినిమాపై వచ్చిన కొన్ని రకాల విమర్శలపై కూడా ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసారు.
ఈ నేపథ్యంలో తన సినిమాలేవి కూడా ఇకపై ఫిల్మ్ మీడియా ప్రచారం చేయోద్దని సవాల్ కూడా విసిరారు. తాజాగా ఈ సినిమా దర్శకుడు కల్యాణ్ శంకర్ విమర్శకులకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో సినిమాపై వచ్చిన విమర్శల గురించి ఏమంటారు? మ్యాడ్ స్క్వేర్ కంటే మ్యాడ్ బాగుందుంటున్నారు? అని అంటే? `మ్యాడ్ ఆర్గానిక్ కామెడీ. రియలిస్టిక్ సిచ్వేషన్. కాలేజ్ స్టోరీ . ఆ ఎక్స్ పీరియన్స్ ఉన్న వాళ్లు అంతా కనెక్ట్ అవుతారు. ఇది ఆ సినిమా కాదు.
ఈ కథలో ఓ భాయ్ ఉన్నాడు. లైవ్ లో భాయ్ అలాంటి పోలీస్ ఎక్కడైనా ఉంటాడా? ఫిక్షన్ లో రాసిన ఓ కొత్త కథ ఇది. ఒక ఫాంటసీ ఎలిమెంట్ లాంటింది. ఇక్కడ మీకు తెలిసిందల్లా తెలిసిన పాత్రలు మాత్రమే. దీన్ని ఎంజాయ్ చేయాల్సిన వాళ్లు చేస్తున్నారు. ఛాయ్ బిస్కెట్ టీమ్ లో ని ఒకరితో బాహుబలి సినిమా నచ్చలేదన్నాను. అప్పుడాయన ఏమన్నాడంటే? రాజమౌళి అంటే నీకు ఎక్కువ ఇష్టమేమో.
అందుకే నచ్చలేదు అంటున్నావ్ అన్నారు. అంటే నాకర్దం కాలేదు. నువ్వు ఆయన దగ్గర నుంచి చాలా ఎక్స్ పెక్ట్ చేసావ్. అందుకే నీకు నచ్చలేదు. కామన్ ఆడియన్స్ అలా చూడటం లేదు. నువ్వు ఆ కోణంలో మరోసారి `బాహుబలి` చూడు అన్నారు. చూసాను చాలా బాగుంది. కానీ నేను అనుకున్నది వేరు. `మ్యాడ్ స్క్వేర్` విషయంలో కొందరు నాలా అనుకుని ఉండొచ్చు` అని అన్నారు.