Begin typing your search above and press return to search.

మెగా కూతురితో కళ్యాణ్ దేవ్.. వీడియో వైరల్

కళ్యాణ్ దేవ్ ఇన్ స్టాగ్రామ్ లో మొత్తం తన కూతురుతో స్పెండ్ చేసిన విజువల్స్ మాత్రమే ఉండటం విశేషం.

By:  Tupaki Desk   |   15 Nov 2023 4:38 AM GMT
మెగా కూతురితో కళ్యాణ్ దేవ్.. వీడియో వైరల్
X

మెగా డాటర్ శ్రీజని పెళ్లి చేసుకోవడం ద్వారా అందరికి పరిచయం అయిన వ్యక్తి కళ్యాణ్ దేవ్. తరువాత మెగా అల్లుడు బ్రాండ్ తో హీరోగా కూడా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి విజేత అనే మూవీ చేశాడు. ఈ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది. తరువాత మరో మూవీ చేశాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అతని రెండో సినిమా సమయానికి శ్రీజతో బంధం తెగిపోయింది.

ఇప్పుడు కళ్యాణ్ దేవ్ సినిమాలకి కూడా దూరమయ్యాడు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు ఇంటరెస్టింగ్ పోస్టులు పెడుతున్నాడు. శ్రీజ, కళ్యాణ్ దేవికి ఒక కూతురు కూడా ఉంది. కూతురు ప్రేమ కళ్యాణ్ దేవ్ కి విపరీతమైన ప్రేమ ఉంది. దానిని పలు సందర్భాలలో ఇన్ స్టాగ్రామ్ లో బయట పెట్టాడు. అలాగే శ్రీజతో బంధం తెగిపోయినట్లు కూడా పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశారు.

కూతురుతో ఉన్న జ్ఞాపకాలని పంచుకుంటూ సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ పోస్టులు పెడుతూ ఉంటారు. అలా తాజాగా తన కుమార్తెతో సరదాగా ఆడుకుంటున్న వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. తండ్రి కూతుళ్ళ అనుబంధం ఎంత గొప్పగా ఉందో అని నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. మెగా వ్యతిరేకులు అయితే శ్రీజని కించపరుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

కళ్యాణ్ దేవ్ ఇన్ స్టాగ్రామ్ లో మొత్తం తన కూతురుతో స్పెండ్ చేసిన విజువల్స్ మాత్రమే ఉండటం విశేషం. అతను పెట్టిన పోస్ట్స్ కూడా కూతురే తన ప్రపంచంగా బ్రతుతున్నాడని స్పష్టం చేస్తున్నాయి. కుమార్తెతో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ ని అతను ఆశ్వాదిస్తున్నాడు అని దీనిని బట్టి అర్ధం అవుతోంది. అయితే కళ్యాణ్ దేవ్, శ్రీజ విడిపోయారా, విడిపోతే ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనేది క్లారిటీ లేదు.

అలాగే కళ్యాణ్ దేవ్ హీరోగా కూడా నటించే ప్రయత్నాలు చేయడం లేదు. తన వ్యాపారాలు చూసుకుంటే బిజీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలు చేసే ఉద్దేశ్యం ఉందో లేదో అనేది కూడా ఎప్పుడు చెప్పలేదు.