కేసు వెనక్కి తీసుకుంటే 5 కోట్లు.. - కళ్యాణ్ దిలీప్ సుంకర
సెలబ్రెటీ లాయర్ నుంచి మెసేజ్ లు పెట్టిస్తున్నారని, కేసు వెనక్కి తీసుకుంటే 5 కోట్లు ఇస్తానని రాజ్ తరుణ్ ఆఫర్ చేశాడంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర బయటపెట్టారు.
By: Tupaki Desk | 12 July 2024 4:29 AM GMTరాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్య వివాదంలో మరో కీలక విషయాన్ని లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సెలబ్రెటీ లాయర్ నుంచి మెసేజ్ లు పెట్టిస్తున్నారని, కేసు వెనక్కి తీసుకుంటే 5 కోట్లు ఇస్తానని రాజ్ తరుణ్ ఆఫర్ చేశాడంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర బయటపెట్టారు. వాట్సాప్ లో తనకొచ్చిన మెసేజ్ ని చూపించారు. అలాగే ముంబై నుంచి మాల్వీ మల్హోత్రాకి సంబందించిన మనుషులం అంటూ బెదిరింపులకి పాల్పడుతున్నారని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలియజేశారు.
ఆర్ధికంగా, మానసికంగా, శారీరకంగా హింసించి నలిపేస్తుంటే ఎవరైనా తిరగబడతారని, ఈ క్రమంలో బూతులు మాట్లాడితే దానిని చూపించి లావణ్యని తప్పుగా చిత్రీకరిస్తున్నారని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. నీ విక్టిమ్ కార్డు ఎండ్ అయిపోయిందని ఒక లాయర్ తనకి మెసేజ్ చేశాడంటూ లావణ్య ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే ఫోన్ లు చేసి బెదిరిస్తున్నారని, తెలిపింది. మెయింటెనెన్స్ కోసం తన గోల్డ్ మొత్తం అమ్ముకున్నానని లావణ్య తెలియజేసింది.
మీడియాలో ఉన్న కొంతమంది లావణ్య గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారని, అసలు ఏమీ తెలియకుండా, కనీసం కంప్లైంట్ కూడా చదవకుండా లావణ్య మీద విమర్శలు చేస్తున్నారని కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించారు. బెదిరింపులకి పాల్పడుతున్న ఆ లాయర్ ఎవరో, అతని భాగోతం ఏంటో బార్ కౌన్సిల్ లో కచ్చితంగా తేల్చుకుంటా అని కళ్యాణ్ దిలీప్ అన్నారు.
ఎవరో ఓ వ్యక్తి ఫోన్ చేసి లావణ్య 60 లక్షలు ఎత్తుకుపోయిందని హరాస్ చేస్తున్నారని, చట్టపరంగా తేల్చుకోమని వారికి మా వైపు నుంచి హెచ్చరించడం జరిగిందని చెప్పుకొచ్చారు. మాల్వీ మల్హోత్రా డిఫార్మేషన్ కేసులు కట్టుకున్న తమకి ఎలాంటి అభ్యంతరం లేదని, కోర్టుకి వెళ్లిన తర్వాత తమ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపిస్తామని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. మాల్వీ మల్హోత్రా కోసం ఒక ప్రొడ్యూసర్, జైల్లో ఉన్న వ్యక్తి లావణ్యకి ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇలా అన్ని రకాలుగా బెదిరింపు కాల్స్ వస్తున్నప్పుడు లావణ్య భయంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లిందని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. పెళ్లి చేసుకున్న రాజ్ తరుణ్ కూడా కనీసం లావణ్యకి సపోర్ట్ గా నిలబడలేదు. మాల్వీ మల్హోత్రా గురించి ఏమైనా అంటే ఆమె అలాంటిది కాదని వెనకేసుకొస్తున్నాడు. లేదంటే తిరిగి గొడవపడుతున్నాడు. ఇప్పుడు కూడా మాల్వీ మల్హోత్రా మీద ఫిర్యాదు చేయడం వలనే రాజ్ తరుణ్ వెంటనే మీడియా ముందుకొచ్చి ఆమెకి సపోర్ట్ గా వాయిస్ రైజ్ చేసాడని తెలిపారు.
కచ్చితంగా చట్టబద్ధంగా ఫైట్ చేస్తామని, ఎవరు ఎన్ని బెదిరింపులకి పాల్పడిన కోర్టులో తేల్చుకుంటామని కళ్యాణ్ దిలీప్ సుంకర ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తాను లావణ్యకి అన్యాయం జరిగిందని నమ్మి ఫైట్ చేస్తున్నానని, డబ్బులు ఆఫర్ చేస్తే అమ్ముడుపోయే వ్యక్తిని కాదంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు.