Begin typing your search above and press return to search.

S/O వైజయంతి.. కళ్యాణ్ రామ్ కిల్లర్ లుక్

టాలీవుడ్‌లో హీరో కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు కొత్త కథాంశాలతో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   12 March 2025 1:41 PM IST
S/O వైజయంతి.. కళ్యాణ్ రామ్ కిల్లర్ లుక్
X

టాలీవుడ్‌లో హీరో కళ్యాణ్ రామ్ ఎప్పటికప్పుడు కొత్త కథాంశాలతో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు, ఆయన మరోసారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘అర్జున్ S/O వైజయంతి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా, ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసింది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో అసలు హైలైట్ ఏమిటంటే, లెజెండరీ నటి విజయశాంతి మళ్లీ ఓ పవర్‌ఫుల్ పాత్రలో స్క్రీన్‌పై కనిపించబోతున్న విషయం.


ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా విడుదల చేశారు. తాజాగా, మూవీ ప్రీ టీజర్ విడుదల తేదీని ప్రకటించేందుకు మరో స్టైలిష్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కొత్త లుక్‌లో కళ్యాణ్ రామ్ మాస్, స్టైల్, ఇన్టెన్సిటీ అన్నీ కలిపి కనిపిస్తున్నారు. హై ఓక్టేన్ యాక్షన్ మోడ్‌లో నిలుచొని, బ్యాక్‌డ్రాప్‌లో ఒక భారీ వర్క్ ఫీల్డ్ ఉండటం సినిమాకి ఆసక్తిని మరింత పెంచింది.

ఒక్క మాటలో కళ్యాణ్ రామ్ కిల్లర్ లుక్ అంటూ నెటిజన్లు పాజిటివ్ గా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా కథ గురించి అధికారిక సమాచారం వెలువడకపోయినా, టైటిల్ చూస్తే కథలో ఎమోషనల్ డెప్త్‌తో కూడిన మాస్ యాక్షన్ డ్రామా ఉండే అవకాశం కనిపిస్తోంది. కళ్యాణ్ రామ్ గతంలో హార్డ్ హిట్టింగ్ యాక్షన్ మూవీస్‌ చేసినప్పటికీ, ఈ సినిమా మాత్రం ఇంకాస్త ఇంటెన్స్‌గా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

విజయశాంతి పాత్ర కూడా చాలా ముఖ్యమైనదిగా ఉండబోతోందని ఫిలింనగర్ టాక్. గతంలో ‘సరిలేరు నీకెవ్వరు’తో తన రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి, ఇప్పుడు మరింత స్ట్రాంగ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు సోహైల్ ఖాన్ విలన్‌గా నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అలాగే, కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు తగ్గట్లుగా ఉండనుందని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో మాస్ సినిమాలకు మంచి ఆదరణ పెరుగుతోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ కూడా ఆ కోవలో చేరేలా కనిపిస్తోంది.

టైటిల్‌లోనే ఉన్న బలమైన ఎమోషన్, పాత్రల మధ్య ఉన్న ఇంటెన్సిటీ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చబోతోంది. ముఖ్యంగా, కళ్యాణ్ రామ్ గతంలో చేసిన సినిమాలకు భిన్నంగా, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కొత్త కోణంలో ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తోంది. కంటెంట్ పరంగా, టెక్నికల్ టీమ్ పరంగా హై బడ్జెట్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుండటంతో, దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి, ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.