Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్.. ఈసారి మిస్ కాకుండా..

'డెవిల్' సినిమాతో తన సత్తా నిరూపించేందుకు కల్యాణ్ రామ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Aug 2023 1:30 PM GMT
కళ్యాణ్ రామ్.. ఈసారి మిస్ కాకుండా..
X

'బింబిసార' చిత్రంతో డబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి కల్యాణ్ రామ్.. ఈ సారి ఎలాగైనా పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేయాలని పట్టుదలతో ఉన్నట్లు అర్థమవుతోంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న'డెవిల్' చిత్రంతో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ స్పైగా కనిపించనున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కూడా ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంది.

ఈ సినిమా కోసం మేకర్స్ కూడా పెద్దగా హడావుడి చెయల్లేదు. సింపుల్ అండ్ సైలైంట్ గా 'డెవిల్' షూటింగ్ ను పూర్తి చేశారు. ఒక్క లీక్ కూడా బయటకు రాలేదు. కేవలం గ్లింప్స్ మాత్రమే బయటకు వచ్చింది. అది కూడా మేకర్స్ రిలీజ్ చేసిందే. కల్యాణ్ యాక్షన్ విజువల్స్ ఎంతో గ్రాండ్ గా కనిపించాయి. కల్యాణ్ రామ్ ఎంతో కొత్తగా, డిఫరెంట్ గా కనిపించారు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో, థ్రిల్లింగ్ స్పై జానర్ లో ఈ సినిమా రూపొందడంతో.. నార్త్ ఆడియెన్స్ కు కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యే విధంగా సినిమాను రూపొందిస్తున్నారు. అందుకే మేకర్స్ ఈ చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. బీ4యూ మోషన్ పిక్చర్స్.. ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా గ్లింప్స్ ను హిందీలో విడుదల చేస్తూ మేకర్స్ ప్రకటన ఇచ్చారు.

వాస్తవానికి 'బింబిసారా' సినిమాతోనే కల్యాణ్ రామ్.. ఈ పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేయాల్సింది. ఎందుకంటే ఈ సినిమా కూడా హిస్టారిక్ నేపథ్యంలో రూపొందింది. తెలుగులో సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. తెలుగులో మంచి వసూళ్లను అందుకుంది. కానీ ఆ సమయంలో ఆయన ఎందుకో మిస్ అయ్యారు. అయితే ఈ సారి మాత్రం అలా జరిగేటట్టు కనిపించట్లేదు.

'డెవిల్' సినిమాతో తన సత్తా నిరూపించేందుకు కల్యాణ్ రామ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బింబిసార కాంబో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుందో. ఇప్పటికే ఆమెకు లక్కీ హీరోయిన్ గా ముద్ర పడింది. ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ అవుతోంది. చూడాలి మరి కల్యాణ్ రామ్ కెరీర్ లోనే భారి బడ్జట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో.