Begin typing your search above and press return to search.

NKR21: నిప్పుల మధ్యలో కళ్యాణ్ రామ్ ఫెరోషియస్ అవతార్

నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా, NKR21 సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదలైంది.

By:  Tupaki Desk   |   5 July 2024 5:53 AM
NKR21: నిప్పుల మధ్యలో కళ్యాణ్ రామ్ ఫెరోషియస్ అవతార్
X

నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్‌డే సందర్భంగా, NKR21 సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ ఒక ఫెరోషియస్ అవతార్ లో కనిపిస్తున్నారు. తన చేతికి నిప్పు వేసుకుని, చుట్టూ గూండాల మధ్య కూర్చొని గంభీరంగా చూస్తున్నాడు. కొత్తగా స్టైలిష్ మేకోవర్‌తో కళ్యాణ్ రామ్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఆ సీన్ లో తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని నిప్పు పెట్టినట్టు కనిపిస్తోంది.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ NKR21 సినిమాలో, నందమూరి కళ్యాణ్ రామ్ డేర్‌డెవిల్ స్టంట్స్ చేస్తారని సమాచారం. ఈ ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ సినిమా ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఆశోకా క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ముప్పా వెంకయ్య చౌదరి ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఒక ఐపిఎస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె చాలా కాలం తరువాత వెండితెరపై కనిపిస్తూ ఉండడం విశేషం. గతంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె పాత్ర నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అలాగే సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్ మరియు శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సినిమా షూటింగ్ ఎలాంటి బ్రేకులు లేకుండా శరవేగంగా కొనసాగుతోంది. వివిధ విభాగాల్లో అద్భుతమైన టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రామ్ ప్రసాద్ కెమెరా వర్క్, అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డిపార్ట్‌మెంట్ లో పని చేస్తున్నారు. టీజర్‌లో వారి టాప్-క్లాస్ వర్క్ స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే రాసిన ఈ చిత్రానికి ఎడిటర్ తమ్మిరాజు.

ఈ సినిమా పై కళ్యాణ్ రామ్ అభిమానులలో మంచి అంచనాలు ఉన్నాయి. ఈసారి కళ్యాణ్ రామ్ తన నటనా ప్రతిభను మరింత ప్రదర్శించి, ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాడాని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. స్కా మరోవైపు కళ్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్ కు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ ప్రాజెక్టు ను కూడా ఇదే ఏడాది పట్టాలు ఎక్కించే ప్రయత్నం లో ఉన్నట్లు తెలుస్తోంది.