Begin typing your search above and press return to search.

'బింబిసార 2'.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్

ఈవెంట్ లో భాగంగా 'బింబిసార 2' ఎప్పుడు అని అభిమానులు అడగగా దానికి కళ్యాణ్ రామ్ బదులిస్తూ.. 2024 ఏప్రిల్ లేదా మే లో బింబిసార 2 మొదలవుతుందని చెప్పాడు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 2:10 PM GMT
బింబిసార 2.. మొత్తానికి క్లారిటీ ఇచ్చిన కళ్యాణ్ రామ్
X

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ గా నిలిచిన చిత్రం 'బింబిసార'. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో పీరియాడికల్ డ్రామాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రం 2022 లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అంతేకాదు అప్పటివరకు ఎన్నో సంవత్సరాలుగా అపజయాలతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ కి భారీ కం బ్యాక్ ఇచ్చింది. వశిష్ట అనే డెబ్యూ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన నటనతో అదరగొట్టాడు.

అంతేకాదు కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బింబిసార ఓ మైల్ స్టోన్ మూవీ అని చెప్పొచ్చు. అనుకున్న దానికంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో దీనికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా బింబిసార సీక్వెల్ కు సంబంధించి కళ్యాణ్ రామ్ అదిరిపోయే అప్డేట్ అందించాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'డెవిల్' మూవీ ట్రైలర్ ని మంగళవారం అభిమానుల సమక్షంలో ఈవెంట్ నిర్వహించి విడుదల చేశారు.

ఈవెంట్ లో భాగంగా 'బింబిసార 2' ఎప్పుడు అని అభిమానులు అడగగా దానికి కళ్యాణ్ రామ్ బదులిస్తూ.. 2024 ఏప్రిల్ లేదా మే లో బింబిసార 2 మొదలవుతుందని చెప్పాడు. అయితే ఈ సీక్వెల్ ని వేరే డైరెక్టర్ తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బింబిసార మూవీని డైరెక్ట్ చేసిన వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. దాంతో బింబిసార సీక్వెల్ ని అనిల్ పాడురి అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

ఈ అనిల్ పాడురి బింబిసార మూవీకి వీఎఫ్ఎక్స్ పనులు చూసుకున్నాడు. అతనే ఇప్పుడు బింబిసార 2 స్క్రిప్ట్ పై ఓ టీమ్ తో కలిసి పనిచేస్తున్నట్లు ఇండ్రస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇక డెవిల్ విషయానికొస్తే.. పీరియాడికల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ బ్రిటీస్ సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ నామ ఈ సినిమాను నిర్మించడంతోపాటు దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా ఇదే. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూర్చారు. డిసెంబర్ 29న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.