Begin typing your search above and press return to search.

సలార్ తో నందమూరి హీరో రిస్క్?

బాహుబలి సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కు సరైన సక్సెస్ అయితే రాలేదు. అయినప్పటికీ ఫ్లాప్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద ఈజీగా వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 2:30 PM GMT
సలార్ తో నందమూరి హీరో రిస్క్?
X

బాహుబలి సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ కు సరైన సక్సెస్ అయితే రాలేదు. అయినప్పటికీ ఫ్లాప్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద ఈజీగా వందల కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాడు. ఇక టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ వీకెండ్ లో ప్రభాస్ సినిమాలు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటూ ఉంటాయి. ఇక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఆ హడావిడి రెండు వారాలపాటు కొనసాగుతుంది అని చెప్పవచ్చు.

ఇక సలార్ సినిమా కచ్చితంగా అలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని ఫ్యాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఈసారి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏమాత్రం నిరాశపరచకుండా ప్రభాస్ ను చూపిస్తాడు అని అనుకుంటూ ఉన్నారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అంచనాలను పెంచేసిందే. అయితే ఈ సినిమా విడుదలవుతున్న సమయంలో పోటీపడేందుకు పెద్ద సినిమాలు కూడా అసలు ఏమాత్రం ఆలోచించడం లేదు.

ఇక షారుక్ ఖాన్ డుంకి సినిమా మాత్రం వేరే దారిలేక డిసెంబర్ 21న రాబోతోంది. ఆ మారుసటి సలార్ వస్తుంది. తప్పకుండా షారుఖ్ సినిమా కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కానీ సలార్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డంకీ సినిమాకు తిప్పలు తప్పవు. అయితే ఇలాంటి ఫైట్లో మీడియా రేంజ్ హీరోలు ఎవరూ దగ్గరికి కూడా రావడం లేదు.

కానీ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మాత్రం తన తదుపరి సినిమాను సలార్ కు ఒక వారం తరువాత పోటీలో నిలిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అభిషేక్ పిక్చర్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రం డెవిల్. స్పై యాక్షన్ ఫిలిం గా రాబోతున్న ఈ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుంది అని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది.

అయితే ఈ సినిమాను అసలు డిసెంబర్ సెకండ్ వీక్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఎందుకో మళ్ళీ కొన్ని పనులు ఆలస్యం కావడంతో డేట్ మార్చుకున్నారు. ఇప్పుడు డిసెంబర్ 29వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారు. అంటే సలార్ వచ్చిన నెక్స్ట్ వారమే డెవిల్ ను దింపే ఆలోచనలో ఉన్నారు. ఒక విధంగా ఇది రిస్క్ అనే చెప్పాలి. సలార్ సినిమాకు కనీసం యావరేజ్ టాక్ వచ్చిన కూడా రెండు వారాలపాటు ప్రభావం గట్టిగానే ఉంటుంది. ఒకవేళ డివైట్ టాక్ వస్తే మాత్రం అది డెవిల్ కు కొంత కలిసి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఇంత రిస్కులో డెవిల్ నిజంగానే పోటీలో ఉంటాడా లేదా అనేది చూడాలి.