Begin typing your search above and press return to search.

''చిరు, చరణ్, పవన్ లు బన్నీని తొక్కేయాలని ట్రై చేస్తున్నారు''

సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి కమల్ ఆర్. ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.

By:  Tupaki Desk   |   20 Nov 2024 3:53 AM GMT
చిరు, చరణ్, పవన్ లు బన్నీని తొక్కేయాలని ట్రై చేస్తున్నారు
X

సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారికి కమల్ ఆర్. ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ కు చెందిన ఈ మేధావి తనకు తాను క్రిటిక్ గా చెప్పుకుంటూ.. సినిమాల మీద, తనకు నచ్చని స్టార్ హీరోలపైనా నెగెటివ్ పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. నోటికొచ్చినట్లు మాట్లాడి విమర్శలు కొనితెచ్చుకుంటూ ఉంటాడు. గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాల జోలికి రాని కేఆర్కే.. ఇప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు.

"చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లాంటి యాక్టర్స్ తెలుగు సినిమా పరిశ్రమలో కుటుంబానికి చెందినవారు. వారంతా అల్లుఅర్జున్‌ ని అణిచివేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే వారందరి కంటే అల్లు అర్జున్ ఒక్కడే పెద్ద సూపర్ స్టార్ అని అర్థం చేసుకోవాలి. 'పుష్ప 2' చిత్రం హిందీలో ₹50 కోట్లకి పైగా హిస్టారికల్ ఓపెనింగ్‌ను సాధించబోతోంది. ఇది చిరంజీవి ఫ్యామిలీకి హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది" అని కమల్ ఖాన్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

మెగా హీరోలను కించపరుస్తూ, అల్లు అర్జున్ స్టార్ డమ్ ను ఎలివేట్ చేస్తూ కమల్ ఆర్ ఖాన్ పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ మధ్య కాలంలో మెగా, అల్లు హీరోల మధ్య సత్సంబంధాలు లేవనే విధంగా అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు నెట్టింట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అల్లు ఆర్మీ కూడా దీనికి గట్టిగా కౌంటర్ ఇస్తూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన 'పుష్ప 2' ట్రైలర్ కు మెగా సపోర్ట్ లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా పాట్నా వేదికగా 'పుష్ప 2: ది రూల్' ట్రైలర్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ ఈ ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. యావత్ సినీ ప్రియులు, సినీ సెలబ్రిటీలు ఈ ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కానీ మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రం దీనిపై స్పందించలేదు. మరోవైపు సోషల్ మీడియాలో మెగా, అల్లు అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. దీన్ని అదనుగా చూసుకొని ఇప్పుడు కమల్ ఆర్ ఖాన్ లాంటి వారు, ఇరు వర్గాల మధ్య గొడవలు పెరిగే విధంగా చౌకబారు పోస్టులు పెడుతున్నారని అర్థమవుతోంది.

'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ డమ్ సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న 'పుష్ప 2' పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకి పైగా వసూళ్లు రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు. నార్త్ బెల్ట్ లో సంచలనం సృష్టించడం ఖాయమని నమ్ముతున్నారు. హిందీలో ఈజీగా 50 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ సినిమా అంత పెద్ద సక్సెస్ సాధించడం మెగా హీరోలకు గుండెపోటు తెప్పిస్తుందని కేఆర్కే చేసిన ప్రకటన అసంబద్ధమైనదే అవుతుంది. ఇది అటెన్షన్ కోసమో లేదా తన పబ్లిసిటీ కోసమో ఇతరులను కించపరిచే ప్రయత్నం తప్ప మరొకటి కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవల అల్లు అర్జున్ 'అన్ స్టాపబుల్ 4' టాక్ షో వేదికగా పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. ఆయన ధైర్యం అంటే తనకు చాలా ఇష్టమని, తన దారిలో తాను వెళ్ళిపోతుంటాడని అన్నారు. తాను దగ్గర నుంచి చూసిన వెరీ డేరింగ్ పర్సన్ ఆయనే అని బన్నీ తెలిపారు. కాబట్టి కమల్ ఆర్ ఖాన్ లాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను ఎవరూ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినా వాళ్ళ మధ్య ఎన్ని ఉన్నా, సందర్భం వస్తే అన్నీ మర్చిపోయి కలిసిపోతారని సన్నిహితులు చెబుతున్నారు. సో ఇరు వర్గాల అభిమానులు ఇకనైనా ఫ్యాన్ వార్స్ ఆపేస్తే బాగుంటుంది.