Begin typing your search above and press return to search.

'కల్కి' కంటే 'బ్రహ్మాస్త్రం' సినిమా 20 రెట్లు బెటర్

నిజానికి కమల్ ఆర్ ఖాన్ మన తెలుగు సినిమాల మీద ఇలాంటి నెగిటివ్ పోస్టులు పెట్టడం ఇదేమీ మొదటిసారి కాదు.

By:  Tupaki Desk   |   4 July 2024 3:38 AM GMT
కల్కి కంటే బ్రహ్మాస్త్రం సినిమా 20 రెట్లు బెటర్
X

వరల్డ్ బాక్సాఫీస్‌ వద్ద 'కల్కి' దండయాత్ర కొనసాగుతూనే ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. నార్త్ ఇండియా నుంచి నార్త్ అమెరికా వరకూ.. అన్ని ఏరియాల్లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 700 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం.. 1000 కోట్ల మార్క్ దిశగా పయనిస్తోంది. అలాంటి సినిమాపై ఇప్పుడు బాలీవుడ్ కు చెందిన కమల్ ఆర్ ఖాన్ తన అక్కసు వెళ్లగక్కారు.

"కల్కి కంటే 'బ్రహ్మాస్త్రం' సినిమా 20 రెట్లు బాగుందని నేను పూర్తి బాధ్యతతో చెప్పగలను. జనాలు కల్కిని చూస్తున్నారు కానీ, బ్రహ్మాస్త్రం మూవీని చూడలేదంటే, అంటే వారు నిజంగా బాలీవుడ్‌ను ద్వేషిస్తారు" అని కమల్ ఆర్. ఖాన్ సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' లో పోస్ట్ పెట్టారు. దీనిపై టాలీవుడ్ సినీ అభిమానులు, రెబల్ స్టార్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తెలుగు సినిమా హలీవుడ్ రేంజ్ లో ప్రశంసలు అందుకోవడం నచ్చకనే KRK ఇలాంటి చవకబారు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నార్త్ లో ప్రభాస్ డామినేషన్ చూడలేకే ఇలాంటి కామెంట్లు చేస్తున్నాడని ఫైర్ అవుతున్నారు. జైలుకి వెళ్లొచ్చినా అతనికి బుద్ధి రాలేదని విరుచుకు పడుతున్నారు.

నిజానికి కమల్ ఆర్ ఖాన్ మన తెలుగు సినిమాల మీద ఇలాంటి నెగిటివ్ పోస్టులు పెట్టడం ఇదేమీ మొదటిసారి కాదు. ఫిలిం క్రిటిక్ అని చెప్పుకుంటూ గతంలో అనేకసార్లు టాలీవుడ్ హీరోలు, తెలుగు చిత్రాల మీద నోటికొచ్చినట్లుగా మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ అప్పట్లో చాలా ట్వీట్లు పెట్టాడు. బాహుబలి-2 పై నెగిటివ్ పోస్ట్ పెట్టగా.. మనోళ్ళ కౌంటర్ ఎటాక్ తట్టుకోలేక, చివరకు సారీ చెప్పి కాళ్ళ బేరానికి వచ్చాడు. ఆ తర్వాత కూడా KRK తన వక్ర బుద్ధి మార్చుకోలేదు. తాజాగా 'కల్కి 2898 AD' సినిమాపై పోస్ట్ పెట్టి, ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. అయితే అతని పోస్టులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అటెన్షన్ కోసమే ప్రభాస్ సినిమా మీద రాళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇక 'కల్కి' సినిమా విషయానికొస్తే.. సైన్స్ కు భారతీయ పురాణాలు, పురాణాల్లోని ఐకానిక్ పాత్రలకు ముడిపెడుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందించిన ఈ చిత్రం.. బిగ్ స్క్రీన్ మీద ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. హలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా విజువల్ వండర్ ను ఆవిష్కరించారని దర్శకుడిని అంతా కొనియాడుతున్నారు. ఈ సినిమాలో అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌, సుప్రీం యాస్కిన్‌గా కమల్‌ హాసన్‌ ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, రాజమౌళి అతిథి పాత్రల్లో మెరిశారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. క్లైమాక్స్ లో కర్ణుడిగా కనిపించి కల్కి సినిమాటిక్ యూనివర్స్ పై అంచనాలు పెంచేశారు.