చైనాలో ఎంబిబిఎస్.. అలా చేయక తప్పలేదంటున్న హీరోయిన్..!
ప్రొఫెషనల్ గా ఒకటి చేసి సినిమాల మీద ఆసక్తితో వెండితెరకు పరిచయమయ్యే వారు చాలామంది ఉంటారు.
By: Tupaki Desk | 27 Feb 2025 9:00 AM ISTప్రొఫెషనల్ గా ఒకటి చేసి సినిమాల మీద ఆసక్తితో వెండితెరకు పరిచయమయ్యే వారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా డాక్టర్ అవుదామని కొందరు యాక్టర్ అవుతారు కానీ ఈమధ్య చాలా మంది డాక్టర్ అయ్యి కూడా యాక్టర్ అవుతున్నారు. హీరోయిన్స్ అంతా ఎక్కువగా డాక్టర్ కోర్స్ చేస్తూ సినిమాల్లోకి వస్తున్నారు. కొందరు రెండిటినీ ఒకేసారి చేస్తున్న వారు ఉన్నారు. మన స్టార్ హీరోయిన్స్ సాయి పల్లవి, శ్రీలీల కూడా ఓ పక్క డాక్టర్ చదువుతూ సినిమాలు చేస్తున్నారు.
ఐతే ఈమధ్య తెలుగు సినిమాల్లో తరచు కనిపిస్తున్న ఒక హీరోయిన్ కూడా ఎంబిబిఎస్ చేసి సినిమాల్లోకి ఎంటర్ అయ్యింది. నటిగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎలాంటి పాత్రలు వచ్చినా చేస్తూ వస్తుంది కామాక్షి భాస్కర్ల. సినిమా పట్ల ఆమెకు ఉన్న అంకితభావం ఎలాంటిదో ఆమె చేస్తున్న పాత్రలు అందుకు ఆమె తీసుకుంటున్న కేర్ చూస్తే తెలుస్తుంది. పొలిమేర సీరీస్ లతో మెప్పిస్తున్న అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
కామాక్షి భాస్కర్ల రీసెంట్ గా తన ఎంబిబిఎస్ విషయాలను పంచుకుంది. చైనాలో ఎంబిబిఎస్ చేస్తున్న టైం లో అక్కడ ఏది దొరికితే అది తినేశానని అన్నది కామాక్షి. ఎక్కడికి వెళ్లినా అక్కడ వారు ఏం తింటారో అది తినేయడం అలవాటని. చైనాలో గ్రీనరీ అసలు ఉండదు. కూరగాయలు కూడా దొరకవు. అందుకే అక్కడ జీవులను చంపి తింటారు. ఆ టైం లోనే తనకు తేళ్లు, బొద్దింకలు తినడం అలవాటైందని అన్నారు.
ప్రస్తుతం కామాక్షి మ్యాన్షన్ హౌస్ మల్లేష్, పొలిమేర 3 సినిమాల్లో నటిస్తున్నారు. డాక్టర్ గా ప్రొఫెషనల్ కోర్స్ చేసినా కూడా సినిమాల మీద ఆసక్తితో టాలీవుడ్ వచ్చి ఇక్కడ తన దాకా వస్తున్న ప్రతి పాత్రలు చేస్తూ వస్తుంది. ఐతే ఎలాంటి పాత్ర అయినా తెర మీద తన ప్రతిభ చాటడమే ముఖ్యం అనిపించేలా చేస్తున్న కామాక్షి రానున్న రోజుల్లో మరిన్ని సర్ ప్రైజింగ్ రోల్స్ చేసి అలరించాలని చూస్తుంది. ఇలాంటి పాత్ర అయితేనే చేస్తా అని కండీషన్స్ ఏమి లేకుండా ఇచ్చిన పాత్రతో ప్రేక్షకులను మెప్పిస్తున్న కామాక్షికి కచ్చితంగా త్వరలోనే కెరీర్ టర్న్ తిప్పే రోల్స్ పడతాయని ఆడియన్స్ చెబుతున్నారు.