కమల్.. స్క్రిప్ట్ ను అలా హ్యాండిల్ చేస్తున్నారా?
చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఎన్నో ఏళ్లు అయినా.. ఆయన అదే పంథాను కొనసాగిస్తున్నారు.
By: Tupaki Desk | 21 Dec 2024 12:30 AM GMTకమల్ హాసన్.. సినీ ఇండస్ట్రీలో ఆయన ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. చిత్ర పరిశ్రమలోకి వచ్చి ఎన్నో ఏళ్లు అయినా.. ఆయన అదే పంథాను కొనసాగిస్తున్నారు. ఏడు పదుల వయసులో వరుస చిత్రాలతో అలరిస్తున్నారు. తన విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు!
అయితే మక్కల్ నీది మయమ్ పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కమల్.. ఎప్పటికప్పుడు పలు విషయాలపై స్పందిస్తుంటారు. అదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ ఇస్తుంటారు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా కమల్ హాసన్.. ఇన్ స్టాలో ఓ క్రేజీ పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన.. గ్లోవ్స్ తో కొత్త స్క్రిప్ట్ ను హ్యాండిల్ చేస్తున్నట్లు పోస్ట్ పెట్టారు. ఓ క్లాత్ షోరూమ్ కు వెళ్లిన ఆయన.. గ్లోవ్స్ ను హ్యాండ్స్ కు వేసుకుని చెక్ చేసుకున్నారు. ఆ సమయంలో దిగిన పిక్ ను పోస్ట్ చేశారు. నా కొత్త స్క్రిప్ట్‌ను కిడ్ గ్లోవ్స్ తో హ్యాండిల్ చేస్తున్నానంటూ క్యాప్షన్ గా కమల్ హాసన్ రాసుకొచ్చారు.
పిక్ లో అదిరిపోయే లుక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కిడ్ గ్లోవ్స్ తో స్క్రిప్ట్ ను హ్యాండిల్ చేస్తున్నారా సర్ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా చికాగోలో చిల్ అవుతున్న పిక్స్ కూడా పోస్ట్ చేశారు. చికాగో చాలా చల్లగా ఉంటుందని రాసుకొచ్చారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. 2024లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీలో సుప్రీం యాస్కిన్ రోల్ లో నటించారు. తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. ఆ సినిమా సీక్వెల్ లో కూడా నటించనున్నారు. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ సీక్వెల్ ఇండియన్-2 మూవీతో థియేటర్లలో సందడి చేశారు. కానీ ఆ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు.
కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్-2 బాగా నిరాశపరిచింది. ఇప్పుడు ఇండియన్-3లో యాక్ట్ చేస్తున్నారు. త్వరలో ఆ సినిమా థియేటర్లలోనే రిలీజ్ అవ్వనుందని రీసెంట్ గా శంకర్ క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న థగ్ లైఫ్ లో యాక్ట్ చేస్తున్నారు. 37 ఏళ్ల తర్వాత శంకర్, కమల్ కాంబో రిపీట్ అవుతుండడంతో.. జూన్ 5న రిలీజ్ కానున్న ఆ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.