కమల్ హాసన్ ఐడియాలకు నాగీ రూపం!
విశ్వనటుడు కమల్ హాసన్ చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎంపిక చేసుకునే కథలు ఎంతో ఇన్నోవే టివ్ గా ఉంటాయి.
By: Tupaki Desk | 28 Dec 2024 2:30 PM GMTవిశ్వనటుడు కమల్ హాసన్ చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఎంపిక చేసుకునే కథలు ఎంతో ఇన్నోవే టివ్ గా ఉంటాయి. ఇతర దర్శకులతో పనిచేసిన చిత్రాలు కావొచ్చు. తాను స్వీయా దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమాలు కావచ్చు. సినిమా ఏదైనా? కథల్లో..పాత్రల్లో కొత్తదనం కోరుకునే దర్శక, నటుడాయన. తీవ్రవాదం మీద సినిమా చేసినా? సనాతన ధర్మం మీద సినిమా చేసినా? యాక్షన్ సినిమా చేసినా? ఫ్యామిలీ ఎంటర్ టైనర్లో నటించినా? అంతిమంగా ప్రేక్షకుడి కి కొత్త ఫీల్ అందించామా? లేదా? అన్న కోణంలో కమల్ సినిమాలుంటాయి.
ఇన్నో వేటివ్ ఐడియాలతో వచ్చే రచయితల్ని, దర్శకుల్ని ప్రోత్సహించడంలో ముందుడే వ్యక్తి కమల్. ఇటీవల రిలీజ్ అయిన కల్కి 2898 లో `కలి` అనే పాత్రలో నటించారు. సుప్రీమ్ యాస్కిన్‌గా అపోకలిప్టిక్ అనంతర ప్రపంచాన్ని పాలించే నిరంకుశ పాత్ర ఇది. సినిమాలో కమల్ పాత్ర కేవలం ఏడు నిమిషాలే ఉన్నా? ఆ పాత్ర విశ్వరూపం `కల్కి` రెండవ భాగంలో కనిపిస్తుంది.
ఈ పాత్రను నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా రాసాడని కలమ్ పలు సందర్భా ల్లోనూ ప్రశంసించారు. తన ఆలోచనలకు దగ్గరగానూ నాగీ ఉన్నాడు? అన్న ఉద్దేశాన్ని పంచుకున్నారు. ఇటీవలే కమల్ -నాగీ ఇద్దరు ఓ వేడుకలోనూ ఇంటరాక్ట్ అయ్యారు. టాలీవుడ్ లో ఎంతో మంది దర్శకులు ఉన్నారు. కానీ కమల్ నుంచి కేవలం నాగీకి మాత్రమే పిలుపు వచ్చింది. ఆ ఈవెంట్లో లెజెండ్స్ తో పాలు పంచుకునే అవకాశం ఆయనకు మాత్రమే దక్కింది.
ఈ నేపథ్యంలో కమల్ హాసన్ భవిష్యత్ లో నాగ్ అశ్విన్ తో మరిన్ని సినిమాలకు పనిచేసే అవకాశం ఉంటుందని ఆ భేటీలో చర్చకు వచ్చిందని అంతర్గత సమాచారం. వరల్డ్ సినిమాని టార్గెట్ చేసేలా కమల్ హాసన్ , నాగ్ అశ్విన్ తో కొన్ని ఐడియాల్ని పంచుకున్నారుట. వాటిని ఇంప్లిమేట్ చేసి రాయగలిగితే వండర్స్ క్రియేట్ చేయోచ్చని కమల్ అన్నారుట. అయితే అందుకు నాగీ తన దగ్గర ఉన్న నాలెడ్జ్ సరిపోదని..కెరీర్ ఇప్పుడే మొదలైన నేపథ్యంలో భవిష్యత్ లో పనిచేద్దాం అన్నారుట.