కమల్ థగ్ లైఫ్.. నెట్ ఫ్లిక్స్ గట్స్ ఏంటి..?
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విక్రం సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చారు.
By: Tupaki Desk | 23 Sep 2024 7:11 AM GMTయూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ విక్రం సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో తిరిగి సూపర్ ఫాం లోకి వచ్చారు. ఆ సినిమా సక్సెస్ అవ్వడం వల్లే ఆపేసిన ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఇండియన్ 2 సినిమా విషయంలో మరోసారి ఫ్యాన్స్ ని నిరాశపరచిన కమల్ రాబోతున్న థగ్ లైఫ్ తో తన సత్తా చాటుతాడని అంటున్నారు. మణిరత్నం దర్శకత్వంలో దాదాపు 3 దశాబ్దాల తర్వాత కమల్ చేస్తున్న సినిమా థగ్ లైఫ్. సినిమాలో కమల్ వేషధారణ అంతా సంథింగ్ స్పెషల్ గా ఉంది.
కమల్ థగ్ లైఫ్ సినిమా సెట్స్ మీద ఉండగానే బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం థగ్ లైఫ్ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనేసినట్టు తెలుస్తుంది. దాదాపు 150 కోట్లకు అటు ఇటుగా థగ్ లైఫ్ డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు టాక్. ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం పోటీ పడగా ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ 147 కోట్లకు కోట్ చేయడంతో రైట్స్ వారి సొంతమైనట్టు తెలుస్తుని.
ఐతే అఫీషియల్ గా ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇది నిజమే అయితే మాత్రం కోలీవుడ్ లోనే ఇది రికార్డ్ అని చెప్పొచ్చు. రీసెంట్ గా దళపతి విజయ్ నటించిన G.O.A.T సినిమాకే నెట్ ఫ్లిక్స్ 125 కోట్ల దాకా కోట్ చేసింది. ఇప్పుడు కమల్ సినిమాకు 150 కోట్లు ఇవ్వడం మైండ్ బ్లాక్ చేస్తుంది. విక్రం తప్ప కమల్ సినిమాలు అంతగా బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది లేదు. మణిరత్నం కూడా అంత గొప్ప ఫాం లో లేడు. అలాంటిది ఇద్దరు కలిసి చేస్తున్న థగ్ లైఫ్ డిజిటల్ రైట్స్ కు అంత డిమాండ్ ఉండటం షాకింగ్ గా ఉంది.
ఐతే కమల్ హాసన్, మణిరత్నం కాంబోకి ఉన్న అంచనాలను ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. థగ్ లైఫ్ తో మరోసారి మణిరత్నం తన డైరెక్షన్ టాలెంట్ చూపిస్తారని అంటున్నారు. సినిమా నుంచి ఆమధ్య వచ్చిన గ్లింప్స్ అంచనాలు పెంచగా ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉండబోతుందో అని అటు కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటుగా మణిరత్నం ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు.