Begin typing your search above and press return to search.

జూన్ లో జాత‌ర మ‌ళ్లీ కలిసొచ్చేనా!

ఇందులో క‌మ‌ల్ యాస్కిన్ విల‌న్ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసింద‌.

By:  Tupaki Desk   |   2 March 2025 10:00 PM IST
జూన్ లో జాత‌ర మ‌ళ్లీ కలిసొచ్చేనా!
X

విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ 'విశ్వ‌రూపం2' త‌ర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని 'విక్ర‌మ్' సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. 'ల‌క్ర‌మ్' బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. లొక‌ష్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ లో భాగంగా చేసిన చిత్ర‌మిది. ఈ సినిమా 2022 జూన్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ కొత్త సినిమా రిలీజ్ చేయ‌డానికి మ‌రో రెండేళ్లు ప‌ట్టింది. అదే ' క‌ల్కి 2898'. ఇందులో క‌మ‌ల్ యాస్కిన్ విల‌న్ పాత్ర పోషించిన సంగ‌తి తెలిసింద‌. ఈ సినిమా కూడా జూన్ లోనే రిలీజ్ అయింది.

అలా క‌మ‌ల్ న‌టించిన రెండు చిత్రాలు జూన్ లో రిలీజ్ అవ్వ‌డం...అవి పాన్ ఇండియాలో పెద్ద విజ‌యం సాధించ‌డం అన్న‌ది విశేషం. ఆ త‌ర్వాత రిలీజ్ అయిన 'ఇండియ‌న్ 2' మాత్రం ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. సినిమాలో విష‌యం లేక‌పోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద తేలిపోయింది. అయితే ఈ సినిమా జూన్ కి బ‌ధులు జులైలో రిలీజ్ అయింది. దీంతో క‌మ‌ల్ న‌టిస్తోన్న‌తాజా చిత్రం 'థ‌గ్ లైఫ్' రిలీజ్ విష‌యంలో మ‌ళ్లీ జూన్ సెంటిమెంట్ వ‌ర్కౌట్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని జూన్ 5న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యి నెల‌లు గ‌డుస్తోంది. అప్ప‌టి నుంచి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లోనే ఉందీ చిత్రం. మే క‌ల్లా అన్ని ప‌నులు పూర్తి చేసి జూన్ లో రిలీజ్ కి పెట్టుకున్న‌ట్లు తెలుస్తుంది. స‌క్సెస్ కోణంలో ఆ నెల క‌లిసి రావ‌డం కూడా జూన్ రిలీజ్ కి మ‌రో కార‌ణం కావొచ్చు. అలాగే 'ఇండియ‌న్ 3' షూటింగ్ కూడా పూర్త‌యింది.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు ? అన్న‌ది తేలాలి. వాస్త‌వానికి ఈ చిత్రాన్ని ఇప్ప‌టికే రిలీజ్ చేయాలి. కానీ శంక‌ర్ వైఫ‌ల్యాలు..'ఇండియ‌న్ 2' ఫెయిల వ్వ‌డంతో? అవ‌స‌రం మేర రీ షూట్ కూడా చేసారు. ఈ నేప‌థ్యంలో రిలీజ్ డిలే అవుతుంది. అలాగే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.