Begin typing your search above and press return to search.

సేనాప‌తిపై జ‌ర్న‌లిస్ట్ డౌట్.. శంక‌ర్ స‌మాధాన‌మిదే!

అంటే 106 ఏళ్ల సేనాపతి ఇంత ప్రమాదకర విన్యాసాలు చేయడం ఎలా సాధ్యం అనేది కొంద‌రి సందేహం.

By:  Tupaki Desk   |   27 Jun 2024 4:53 AM GMT
సేనాప‌తిపై జ‌ర్న‌లిస్ట్ డౌట్.. శంక‌ర్ స‌మాధాన‌మిదే!
X

క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన 'భారతీయుడు 2' థియేట్రికల్ ట్రైలర్ ఇటీవ‌ల‌ విడుదలైన సంగ‌తి తెల‌సిందే. కాంబినేష‌న్ దృష్ట్యా ఈ ట్రైల‌ర్ వేగంగా ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లింది. కానీ ప్రేక్షకుల నుండి ప్రారంభ స్పందన ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా తెలుగు, త‌మిళ బెల్ట్ ఆడియెన్ ని విస్మ‌రిస్తే, క‌నీసం త‌మిళ ప్రేక్ష‌కుల నుంచి కూడా ఆశించిన స్పంద‌న క‌రువైంద‌న్న టాక్ వినిపిస్తోంది. సినిమా కాన్సెప్ట్ పాత తరహాలో ఉందని.. ఈ ట్రైల‌ర్ లో చూపించిన కొన్ని స‌న్నివేశాలు ఔట్ డేటెడ్ గా ఉన్నాయ‌ని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన ఫిర్యాదు సేనాప‌తి పాత్ర‌పైనే. కమల్ హాసన్ పాత్ర, దాని చిత్రీక‌ర‌ణ గురించి సందేహాలు లేవ‌నెత్తుతున్నారు. మొదటి భాగం ప్రకారం సేనాపతి 1918లో జన్మించాడు. అంటే 106 ఏళ్ల సేనాపతి ఇంత ప్రమాదకర విన్యాసాలు చేయడం ఎలా సాధ్యం అనేది కొంద‌రి సందేహం.

అయితే ఇలాంటి అన్ని సందేహాల‌కు ముంబైలో జ‌ర‌గిన మీడియా స‌మావేశంలో శంక‌ర్ త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. శంకర్‌ మాట్లాడుతూ ''చైనాలో మార్షల్‌ ఆర్ట్స్‌ మాస్టర్‌ ఉన్నారు. అతని పేరు లు జిజియన్. 120 ఏళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నాడు. అతడు ఎగురుతూ తన్నుతున్నాడు. అన్ని పనులను అవ‌లీల‌గా చేస్తున్నాడు. అత‌డే స్ఫూర్తి'' ని అన్నారు. శంకర్ ఇంకా మాట్లాడుతూ ''ఈ సేనాపతి క్యారెక్టర్ కూడా మాస్టర్. అతడు మ‌ర్మ కళై అనే పురాతన యుద్ధ కళలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. సేనాపతికి తన ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ ఉంది. అతడు యోగా, ధ్యానం సాధన చేస్తాడు. రోజుకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటాడు. కాబట్టి మీరు మీ క్రాఫ్ట్‌లో మాస్టర్ క్రమశిక్షణ కలిగి ఉంటే.. వయస్సు పట్టింపు లేదు. మీరు ఎలాంటి స్టంట్‌ అయినా చేయగలరు'' అని అన్నారు. నిజానికి శంకర్ వివరణ లాజికల్‌గా ఉంది. అయితే సేనాపతి పాత్ర వెనుక ఉన్న లాజిక్‌ను ప్రేక్షకులు ఎలా అంగీకరిస్తారో చూడాలి.

ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వృద్ధుడి ప్రమాదకర విన్యాసాలు ఎలా సాధ్యం? అని ప్ర‌శ్నించిన జ‌ర్న‌లిస్టుకు కమల్ హాసన్ కూడా త‌న‌దైన శైలిలో స‌మాధానం ఇచ్చారు. ఆయ‌న‌ మాట్లాడుతూ ''ఆ వయసును దర్శకుడు నిర్ణయించాలి. నాకు 120 ఏళ్ల వయసులో కూడా నటించాలని ఉంది'' అని ఉత్సాహాన్ని క‌న‌బ‌రిచారు. భార‌తీయుడు 2 చిత్రం 12 జూలై 2024న థియేట‌ర్ల‌లో విడుదల కానుంది. ఈ సంవత్సరం త‌మిళ ప‌రిశ్ర‌మ ఆశించిన స్థాయిలో వెల‌గ‌లేదు. ఈ భారీ సినిమా విజయం చాలా కీలకం.