భారతీయుడు 3... ఎక్కువ వెయిట్ అక్కర్లేదు
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
By: Tupaki Desk | 30 July 2024 5:10 AM GMTకమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో రూపొంది అప్పట్లోనే అన్ని ఇండియన్ భాషల్లో డబ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదు చేసింది. సుదీర్ఘ కాలం తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా రూపొందిన భారతీయుడు 2 వచ్చింది.
భారతీయుడు స్థాయిలో ఊహించుకున్న ప్రేక్షకులకు భారతీయుడు 2 షాక్ ఇచ్చింది. బాబోయ్ ఇదేం రాడ్ మూవీ అంటూ రివ్యూవర్స్ ఓ రేంజ్ లో ట్రోల్స్ చేశారు. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడు, లోక నాయకుడు అంటూ పేరున్న కమల్ చేసిన సినిమా ఇది అంటే నమ్మశక్యంగా లేదంటూ చాలా మంది విమర్శించారు.
సాధారణంగా రెండో పార్ట్ ఫ్లాప్ అయితే మూడో పార్ట్ పై పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ భారతీయుడు 3 పై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి కనిపిస్తుంది. అందుకు కారణం సినిమా మొత్తం కథ ను పార్ట్ 3 కోసం దర్శకుడు శంకర్ దాచి ఉంచాడు, అంతే కాకుండా మూడో పార్ట్ విజువల్స్ మరియు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుందని స్వయంగా కమల్ ఇతర యూనిట్ సభ్యులు అన్నారు.
రెండో పార్ట్ తో పోల్చితే మూడో పార్ట్ మరింత బాగుంటుంది అంటూ మేకర్స్ చేసిన ప్రకటనలతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే భారతీయుడు 3 రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. కానీ ఎక్కువ రోజులు ఆగాల్సిన అవసరం లేదని సమాచారం అందుతోంది.
శంకర్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా విడుదల పనులతో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. గేమ్ ఛేంజర్ విడుదల అయిన వెంటనే భారతీయుడు 3 కి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేసి ఎక్కువ ఆలస్యం చేయకుండా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట.
ఇండియన్ 2కి అనుకున్న స్థాయిలో స్పందన రాకపోవడంతో మూడో పార్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సినిమాకి భారీగా ఖర్చు చేశారు. కనుక మరింత ఎక్కువ ఆలస్యం చేసి బడ్జెట్ ను మరీ ఎక్కువ పెంచకూడదు అనే ఉద్దేశ్యంతో ఇండియన్ 3 ని 2025 సమ్మర్ కి తీసుకు రావాలని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు మరియు దర్శకుడు శంకర్ ఒక నిర్ణయానికి వచ్చారని తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి శంకర్ అనుకున్న సమయంకు అంటే వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాను విడుదల చేస్తాడా అనేది చూడాలి.