ఆయన నో చెబితే భారతీయుడు ఉండేది కాదా?
విశ్వనటుడు కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో రూపొందిన `భారతీయుడు` సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 3 Jun 2024 9:31 AM GMTవిశ్వనటుడు కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో రూపొందిన `భారతీయుడు` సంచలనాల గురించి చెప్పాల్సిన పనిలేదు. అవినీతి..లంచగొండి తనంపై కమల్ -శంకర్ ద్వయం పూరించిన శమరశంఖం ఏ స్థాయికి చేరిందో ఇండియా అంతటా తెలిసిందే. రిలీజ్ అనంతరం మళ్లీ ఇలాంటి భారతీయుడు పుడతాడా? అన్నంత గొప్ప సినిమాగా నిలిచింది. అందుకే ఆనాటి భారతీయుడిక కొనసాగింపు గా ఇండియన్ -2, 3 భాగాలు కూడా తెరకెక్కుతున్నాయి. అ
అయితే ఈ సినిమా పుట్టుకకు దివంగత నటుడు శివాజీ గణేశన్ కూడా ఓ కారకులు అని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ రోజు కమల్ హాసన్ సీనియర్ మాటను కాదని ఉంటే? భారతీయుడు ఉండేది కాదని తాజాగా కమల్ మాటల్ని బట్టి తెలుస్తోంది. 28 ఏళ్ల క్రితం శంకర్ `భారతీయుడు` కథతో కమల్ ని అప్రోచ్ అయ్యారు. సరిగ్గా అదే సమయంలో శివాజీ గణేషన్ తో కమల్ మరో సినిమా చేయాల్సి ఉంది. ఆ కథ..భారతీయుడు కథ చాలా దగ్గరగా ఉన్నాయి.
ఇదే విషయాన్ని శివాజీ గణేశన్ కి కమల్ హాసన్ వివరించారు. దీంతో గణేశన్ శంకర్ తోనే సినిమా చేయ్..మనిద్దరం ఎన్నో సినిమాలు చేసాం. తర్వాత మళ్లీ కలిసి చేద్దాం. శంకర్ కూడా ఓ సినిమా చేసాడు. చేస్తే బాగుంటుందని కమల్ హాసన్ కి శివాజీ గణేశన్ సలహా ఇవ్వడంతోనే భారతయుడు పుట్టింది. లేదంటే ఆ సినిమా ఉండేది కాదని` కమల్ ఇండియన్ -2 ప్రచారంలో భాగంగా రివీల్ చేసారు. ఒకవేళ కమల్ హాసన్ గనుక శంకర్ కి ఒకే చెప్పకపోతే? ఎలా ఉండేదో గెస్ చేయలేరేమో.
సేనాపతి పాత్రకి మరో నటుడు కనిపించినా న్యాయం చేయగలడా? అన్నది ఊహకే కష్టంగా ఉంది. అప్పటికే కమల్ హాసన్ ఎన్నో వైవిథ్యమైన పాత్రలు పోషించి ఉన్నారు. నటుడిగా ఎంతో పరిణితితో ఉన్నారు. ఇవన్నీ కమల్ లో ఉన్నాయి కాబట్టే శంకర్ ...ఆయనతో ముందుకెళ్లారు అన్నది అంతే వాస్తవం. ఈ చిత్రాన్ని ఏ.ఏం రత్నమే అప్పట్లో నిర్మించారు. ఇప్పుడు సీక్వెల్స్ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు.